తెలంగాణా భరోసా సభను విజయవంతం చెయ్యండి:కత్తి వీరన్న

హాలో బహుజన ఛలో హైదరాబాద్( Hello Bahujana Chalo Hyderabad ) పేరుతో మే 7న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోజరిగే తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలని బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వీరన్న( Kathi Veeranna ) పిలుపునిచ్చారు.బుధవారం మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 ఏళ్లుగా చితికిపోయిన రైతులకు,విద్యార్థులకు, ఉద్యోగులకు,మహిళలకు రాష్ట్ర ప్రజలందరికి భరోసా ఇవ్వడానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షరాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి బెహన్ జీ కుమారి మాయావతి తెలంగాణకి వస్తున్నారన్నారు.

 Lets Make Success Of Telangana Barosa Sabha Katti Veeranna,katti Veeranna,telang-TeluguStop.com

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు పార్లమెంట్ లో అందరికన్నా ముందుగా తమ ఎంపీలతో కలిసి బెహన్ జీ కుమారి మాయావతి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.మాయావతి సారథ్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో అందరి తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం అవడానికి తెలంగాణలో విద్యార్థులు, మేధావులు,ఉద్యోగులు, కార్మికులు,కర్షకులు,ట్రాన్స్ జెండర్ లు,ప్రతి ఒక్కరూ ఇంటి ఇల్లిపాది తరలి రావాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube