వ్యక్తిపై గొడ్డలితో దాడి

సూర్యాపేట జిల్లా:ఓవ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపడిన ఘటన సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని కాసరబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కాసరబాద్ గ్రామానికి చెందిన కొమరశెట్టి శ్రవణ్ అదే గ్రామానికి చెందిన బంటు శీనుకు గతంలో డైరీ ఫామ్ నిర్వహిస్తుడగా కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు.

 Assault On Person With Axe-TeluguStop.com

ఈ లావాదేవీల విషయంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి.ఈ క్రమంలో బంటు శీను బుధవారం సోషల్ మీడియాలో గతంలో మాట్లాడిన ఆడియో పోస్ట్ చేశాడు.

దీంతో కొమిరిశెట్టి శ్రవణ్ అతని దగ్గరకు వెళ్లి నాకు డబ్బులు ఇవ్వకపోగా సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నామని అడిగాడు.దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.

పదిమందిలో డబ్బులు అడుగుతావని కోపం పెంచుకున్న శీను అతని ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని శ్రవణ్ పై దాడి చేయగా తలకు రెండుచోట్ల గాయాలయ్యాయి.వెంటనే స్థానికులు క్షతగాత్రుని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకట్ రాములు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube