లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలి:కార్మిక నేత ఎలుక సోమయ్య గౌడ్

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన ఢిల్లీలో జరిగే కిసాన్ మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీని జయప్రదం చేయాలని కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం)జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు.శనివారం హుజూర్ నగర్ లోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటిన తరుణంలో పేదవాడు పేదరికంలోకి,ఉన్నవాడు మరింత గొప్ప ధనికులుగా మారుతున్నారని చెప్పారు.

 Labor Codes Should Be Repealed Immediately: Labor Leader Etra Somaiya Goud , Et-TeluguStop.com

దీనికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే మూలకారణమని, కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికే ప్రభుత్వాలకు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చల్ల జయకృష్ణ,మండల అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు,ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా, పట్టణ అధ్యక్షులు ఉప్పతల వెంకన్న, కోశాధికారి ఉప్పతల నరేష్,గోవిందు,షేక్ నాగుల్ మీరా,జాన్వియా, బుజ్జి,వెంకన్న,వీరస్వామి,శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube