వేసవికాలంలో చికెన్ తింటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

చికెన్.నాన్ వెజ్ లవర్స్ కు అత్యంత ఇష్టమైన మాంసాహారంలో ఒకటి.

 What Are The Disadvantages Of Eating Chicken In Summer? Chicken, Chicken Health-TeluguStop.com

పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ శాతం మంది ఇష్టంగా తినే నాన్ వెజ్ కూడా చికెనే.ప్రోటీన్ కి గొప్ప మూలం చికెన్.

అలాగే చికెన్ లో ఐరన్, విటమిన్ బి 12 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.కండరాల‌ నిర్మాణం మరియు మరమ్మత్తుకు చికెన్ ఎంతగానో తోడ్పడుతుంది.

చికెన్ రక్తహీనతను త‌రిమికొడుతుంది.శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ను చేకూరుస్తుంది.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ రెగ్యులర్ గా చికెన్ తీసుకోవడం చాలా ప్రమాదకరం.

Telugu Chicken, Tips, Heart, Latest-Telugu Health

అందులోనూ ప్రస్తుత వేసవికాలంలో చికెన్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.మనలో ఎంతో మందికి నిత్యం చికెన్( Chicken ) ను తీసుకునే అల‌వాటు ఉంటుంది.లేదా వారానికి మూడు నుంచి నాలుగు సార్లైనా చికెన్ ను ఓ ప‌ట్టు ప‌ట్టేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే ఎంత ఇష్టం ఉన్నా కూడా ప్రస్తుత వేసవికాలంలో మీరు చికెన్ తినడం మానేయడమే ఎంతో ఉత్తమం.

Telugu Chicken, Tips, Heart, Latest-Telugu Health

ఎందుకంటే చికెన్ శరీరంలో చాలా వేడిని ప్రేరేపించే ఆహారంగా చెప్ప‌బ‌డింది.స‌మ్మ‌ర్‌లో చికెన్ తిన‌డం వ‌ల్ల మీ శరీర ఉష్ణోగ్రత మ‌రింత‌ భారీగా పెరుగుతుంది.బాడీలో హీట్ ఎక్కువైతే తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, క‌ళ్లు మంట‌లు, ర‌క్త‌పోటు అదుపు త‌ప్ప‌డం, కండరాల నొప్పులు( Muscle pain ), విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, డీహైడ్రేషన్ వంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌లెత్తుతాయి.అందుకే వేస‌విలో చికెన్ తిన‌కూడ‌ద‌ని అంటున్నారు.

అలాగే చికెన్ లో కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వు అధిక మొత్తంలో ఉంటాయి.అందువల్ల చికెన్ ను తరచూ తీసుకుంటే గుండెకు ముప్పు పెరుగుతుంది.

గుండె జబ్బుల( Heart disease ) బారిన పడతారు.రోజు చికెన్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తలెత్తుతాయి.రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌లు వ‌చ్చే రిస్క్ సైతం రెట్టింపు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube