సావిత్రి బిల్డింగ్ వల్లే కలిసొచ్చింది.. దాన్ని ఎప్పటికీ అమ్మను: కిరణ్ గుండు

మహానటి సావిత్రి( Mahanati Savitri ) స్టార్ హీరోల హిట్ ఎన్నో సినిమాల్లో నటించారు.ఆ సమయంలో ఆమె బాగా సంపాదించేవారు.

 Lalitha Jewellery Kiran About Savitri House Details, Lalitha Jewellery ,kiran ,s-TeluguStop.com

వాటితో నచ్చిన చోట ఇళ్లు కట్టించుకున్నారు.తర్వాత కాలంలో పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు కలగడం వల్ల ఆమె ఆస్తులు కరిగిపోయాయి.

స్థిరాస్తులను సావిత్రి కొన్నిటిని అమ్ముకున్నారు.మిగిలిన వాటిని సావిత్రి కూతురు చాముండేశ్వరి అమ్మేసుకున్నారు.

వాటిలో ఒక ఇంటిని లలిత జ్యువెలరీ( Lalitha Jewellery ) ఓనర్ కిరణ్ గుండు( Kiran Gundu ) కొనుగోలు చేశారు.సావిత్రి ఇల్లు కొన్న తర్వాతనే తనకు కలిసి వచ్చిందంటూ ఆయన పలు సందర్భాల్లో కూడా తెలిపారు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు.

Telugu Kiran, Kiran Gundu, Kirangundu, Kiran Kumar, Savitri-Movie

సావిత్రమ్మ అంటే కిరణ్ గుండుకు చాలా అభిమానం.ఎంత అభిమానం అంటే ఆ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా సావిత్రి ఫోటోను ఇంట్లో ఎలా ఉన్నదో అలాగే ఇప్పటికీ ఉంచారు.నిజానికి ఈ బిల్డింగ్‌లో రెంట్‌కి ఉన్నప్పుడు సావిత్రి ఫోటోకి దండం పెట్టుకొని ఆయన పనికి వెళ్లిపోయేవారు.

అలా తొమ్మిదేళ్లుగా ప్రతిరోజు దణ్ణం పెట్టుకొని వెళ్లడం వల్ల ఆయన లైఫ్ చాలా చేంజ్ అయింది.రూ.కోట్లు సంపాదించారు.అందుకే ఆ ఇల్లు కొనుగోలు చేయగలిగారు.

అయితే ఇల్లు కొన్న తర్వాత చాముండేశ్వరి( Chamundeswari ) అందులోని వస్తువులన్నిటినీ తీసుకెళ్లారు.ఫోటో కూడా పట్టుకెళ్ళి పోయారు.

ఆ సమయంలో కిరణ్ తన ఆఫీసులో ఉన్నారు.తర్వాత ఇంటికి వచ్చాక ఫోటో లేకపోవడం గమనించి షాక్ అయ్యారు.

Telugu Kiran, Kiran Gundu, Kirangundu, Kiran Kumar, Savitri-Movie

వెంటనే అక్కడే నిల్చోని చాముండేశ్వరికి ఫోన్ చేసి “ఆ ఫోటో ఎందుకు పట్టుకెళ్లారు.అది నాకు కావాలి కావాలంటే ఇలాంటిదే మీకు చాలా గ్రాండ్‌గా పెద్ద ఫోటో తయారు చేసి ఇస్తాను కానీ నాకు ఆ ఫోటో అంటే చాలా సెంటిమెంట్ అని చెప్పాను.దాంతో 45 నిమిషాల్లోనే తిరిగి ఆ ఫోటోని ఒక మాతో పంపించారు చాముండేశ్వరి.” అని కిరణ్ గుండు తెలిపారు.ఎంట్రన్స్ లోనే సావిత్రి ఫోటో ఉంటుందని, రాగానే ఆ ఫోటోకి దణ్ణం పెట్టుకుంటానని వెల్లడించారు.తన అమ్మ, నాన్న ఫోటోలకి కూడా తాను దణ్ణం పెట్టలేదని, సావిత్రిని మాత్రం ఒక దేవతలాగా తాను అభిమానిస్తానని కిరణ్ తెలిపారు.“సావిత్రమ్మ ఇల్లు( Savitri House ) అంటే నాకు ఎంతో సెంటిమెంట్.దీన్ని ఎవరికీ రెంటుకి ఇచ్చే ప్రసక్తే లేదు.

దీనిని ఎవరికీ అమ్మను కూడా.లైఫ్ లాంగ్ ఇందులోనే నేనుంటా” అని పేర్కొన్నారు.

సావిత్రి గణేష్ కార్పొరేట్ ఆఫీస్ లలిత జ్యువెలర్స్ అని ఈ బిల్డింగ్‌కి ఒక పేరు కూడా పెట్టారు.అది గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తుంది.

కిరణ్ గుండు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube