తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు దళపతి విజయ్… ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘గోట్ ‘ సినిమా ( The Goat ) తెలుగులో రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను అలరించలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే తెలుగులో విజయ్ కి అంత మంచి మార్కెట్ అయితే లేదు.ఇలాంటి సందర్భంలో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఆయన చేసిన ఈ నాసిరకం సినిమా ప్రేక్షకులను అలరించడంలో చాలావరకు వెనుకబడి పోతుందనే చెప్పాలి.
ఇక మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా మీద భారీ విమర్శలైతే వస్తున్నాయి.ఇక తను రాజకీయంగా ఎంట్రీ ఇస్తున్న సందర్భంలో చేస్తున్న చివరి సినిమాలు కావడం వల్ల ఈ సినిమాల విషయంలో ఆయన అంత పెద్దగా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా కనిపించడం లేదు.అందుకోసమే ఈ సినిమాని చాలా సింపుల్ గా చేశారు.మాస్ లో తనకున్న మంచి ఫాలోయింగ్ ని అందుకోవడంలో ఈ సినిమా చాలావరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి.తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనే విషయం పక్కన పెడితే తెలుగులో మాత్రం ఈ సినిమాకి ఆదరణ కరువవుతుందనే చెప్పాలి.
ఇక వెంకట్ ప్రభు గత చిత్రమైన కష్టడి సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.ఇలాంటి ఫెయిల్యూర్ దర్శకుడితో సినిమా చేయడమే విజయ్ చేసిన పెద్ద తప్పు అని అభిమానులు వాపోతున్నారు.వరుసగా విజయ్ కి భారీ డిజాస్టర్లు రావడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పటికే బీస్ట్, వారసుడు, లియో లాంటి భారీ డిజాస్టర్ల తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగలడం అనేది ఆయనకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి…
.