అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ తో బోల్డ్ సినిమా చేస్తే ఆయన అభిమానులు ఒప్పుకుంటారా..?

అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy ) తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాతో పాటుగా ఆయన తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 Will Allu Arjun's Fans Agree If He Does A Bold Film With Sandeep Reddy Vanga , A-TeluguStop.com

ఇక దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ ఒక బోల్డ్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఇప్పటివరకు డీసెంట్ పాత్రలను పోషించిన అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటిస్తే అతని అభిమానులు దానిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్న అల్లు అర్జున్( Allu Arjun ) ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఆయన క్రేజ్ అనేది తార స్థాయికి వెళ్ళిపోతుందనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేసి బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

 Will Allu Arjun's Fans Agree If He Does A Bold Film With Sandeep Reddy Vanga , A-TeluguStop.com

ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ చేసిన ‘అనిమల్’ సినిమా( Animal movie ) భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాతో రణ్బీర్ కపూర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు.ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి…ఇక ఈ సినిమా రన్బీర్ కపూర్ కెరియర్ లోబిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఆయనను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube