లండన్‌లోని భారత హైకమీషన్‌పై దాడి కేసు .. ఇందర్‌పాల్ ప్రమేయం నిజమే, ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

గతేడాది యూకే రాజధాని లండన్‌లోని భారత హైకమీషన్‌పై( Indian High Commission ) జరిగిన దాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది.ఈ ఘటనలో నిందితుడిపై ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్లు అధికారికంగా తెలిపింది.ఢిల్లీలోని ఎన్ఐఏ( NIA ) ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.2023 మార్చి 22న లండన్‌లోని( London ) భారత హైకమీషన్ ఎదుట జరిగిన భారత వ్యతిరేక ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న ఆందోళనకారులలో ఒకరిగా హౌన్‌స్లోలో నివసిస్తున్న ఢిల్లీకి చెందిన ఇందర్‌పాల్ సింగ్ గబా( Inderpal Singh Gaba ) అనే యూకే జాతీయుడిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది.

 Nia Chargesheets Key Accused Inderpal Singh For Indian High Commission Attack In-TeluguStop.com
Telugu Amritpal Singh, Inderpal Singh, Inderpalsingh, Indian, Indian Attack, Kha

వేర్పాటువాద కార్యకలాపాలలో అతని పాత్రను నిర్ధారించిన సమగ్ర దర్యాప్తు తర్వాత నిందితుడిని ఈ ఏడాది ఏప్రిల్ 25న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.అతనిపై జారీ చేసిన లుకౌట్ సర్క్యూలర్ ఆధారంగా లండన్ నుంచి పాకిస్తాన్ మీదుగా అట్టారీ సరిహద్దు వద్దకు వచ్చిన గాబాను ఇమ్మిగ్రేషన్ అధికారులు డిసెంబర్ 2023న అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత ఇందర్‌పాల్‌పై దర్యాప్తు ప్రారంభించామని, విచారణ కొనసాగుతుండగా దేశం విడిచివెళ్లొద్దని కోరినట్లు ఎన్ఐఏ పేర్కొంది.నెల రోజుల పాటు జరిగిన విచారణ సందర్భంగా ఎన్ఐఏ అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది.సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, ఫోటోలను పరిశీలించింది.చివరికి ఈ ఘటనలో అతని ప్రమేయాన్ని నిర్ధారించింది.

Telugu Amritpal Singh, Inderpal Singh, Inderpalsingh, Indian, Indian Attack, Kha

గతేడాది మార్చిలో ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.అతనికి మద్ధతుగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోని భారత రాయబార కార్యాలయాల వద్ద ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆందోళనలకు దిగారు.అమృత్‌పాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు తీసుకున్న చర్యకు ప్రతీకారంగా లండన్‌లో దాడికి కుట్రపన్నారని, దీనిలో భాగంగానే అక్కడి భారత హైకమీషన్ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube