బాలయ్యను దేవుడు కంటే ఎక్కువగా ఎలివేట్ చేసిన మూడు సినిమాలు..?

బాలకృష్ణ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు లాజిక్, ఫిజిక్స్, ఇంకా అన్ని సైన్స్ రూల్స్ ని బ్రేక్ చేస్తుంటాయి.బాలయ్య బాబు ఎలివేషన్స్ మామూలుగా ఉండవని చెప్పుకోవచ్చు.

 Boyapati Elevation To Balakrishna Like God ,simha , Balakrishna, Boyapati ,le-TeluguStop.com

ఇప్పటినుంచే కాదు ఎప్పటినుంచో ఆయన ఎలివేషన్ సీన్లు నెక్స్ట్ లెవెన్ లో ఉంటాయి.తొడ గొడితే మెరుపులు, కంటిచూపుతో చంపేయడం, కంటితో కుక్కలను కంట్రోల్ చేయడం లాంటి సన్నివేశాలు పెట్టి బాలకృష్ణ అనుదర్శకులు ఎక్కడికో తీసుకెళ్లారు.

అయితే మూడు సినిమాల్లో బాలయ్యను దేవుడు కంటే ఎక్కువగా ఎలివేట్ చేశారు.ఆ సినిమాలేవో తెలుసుకుందాం.

సింహ

సింహా సినిమా( Simha )లో ఇంటర్వెల్ సీన్‌లో ట్రైన్ ముందు వస్తుందా? లేదంటే మీ దేవుడు ముందు వస్తాడా? అని ఒక రౌడీ ప్రశ్నిస్తాడు అప్పుడు బాలకృష్ణ ముందు వస్తాడు తర్వాత రౌడీలను చితక బాది ప్రజలను కాపాడుతాడు.ఈ ఫైట్ సీక్వెన్స్ లో బాలకృష్ణను దేవుడు లాగా చూపించాడు బోయపాటి శ్రీను.2010లో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం సింహ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ చిత్రంలో నయనతార, స్నేహా ఉల్లాల్‌ నటించారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గానూ బాలయ్యకు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డు లభించింది.ఈ మూవీతో ప్లాపులను ఎదుర్కొంటున్న బాలయ్య వాటి నుంచి బయట కూడా పడ్డాడు.

లెజెండ్

Telugu Akhanda, Balakrishna, Boyapati, Legend, Pragya Jaiswal, Simha, Tollywood-

లెజెండ్ మూవీ( Legend )లో చిన్న బాలకృష్ణను తుపాకీతో షూట్ చేస్తారు.తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడానికి రౌడీలు వస్తుంటారు.అప్పుడు ఒక ముసలామెడ దేవుడా మమ్మల్ని కాపాడు అంటూ పైకి చూస్తుంది.

అదే సమయంలో బాలకృష్ణ ఒక సింహం లాగా బరిలోకి దూకి ఆ ఫ్యామిలీని కాపాడతాడు.ఈ సన్నివేషంలో కూడా బాలయ్యని దేవుడు లెవెల్ లో ఎలివేట్ చేశారు.

ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ పోషించాడు.జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

అఖండ

Telugu Akhanda, Balakrishna, Boyapati, Legend, Pragya Jaiswal, Simha, Tollywood-

ఈ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌( Pragya Jaiswal )ను రౌడీలు చంపేయడానికి వస్తుంటే ఆ సీన్‌లో పరమశివుడిగా వచ్చి పాపని కాపాడుతాడు బాలకృష్ణ.ఈ సినిమాలో ఈ సీన్ ద్వారా మరోసారి బాలయ్యను దేవుడిని చేశాడు బోయపాటి శ్రీను.అఖండ సినిమాని రూ.60 కోట్లు పెట్టి తీస్తే రూ.150 కోట్లు వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి హ్యాట్రిక్ హిట్స్ సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube