తెలుగు ప్రేక్షకులకు నటి శోభిత ధూళిపాళ(sobhita dhulipala) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈమె పుట్టింది పెరిగింది అంత వైజాగ్ లో అయినప్పటికీ కెరియర్ మాత్రం ముంబై లోనే మొదలయ్యింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన కెరీర్ లో ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలు కష్టాల గురించి చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.లక్ష్యం లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను.
మోడల్‌గా ఆడిషన్‌కి వెళ్లే క్రమంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఎంతో బాధపెట్టాయి.మిస్ ఇండియా(Miss India) పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయాలని ప్రయత్నించాను.ఈ క్రమంలో తెల్లగా లేనని ఎందరో విమర్శించారు అంటూ ఆ నాటి రోజుల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.ఒక షాంపూ యాడ్ కోసం ఆడిషన్‌కి వెళితే నువ్వు బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అంటూ అవమానించారు.
ఆ తరువాత ఇంటికెళ్లి అద్దంలో చూసుకుని బాధపడిన రోజులెన్నో ఉన్నాయి అని చెప్పుకుంది శోభిత ధూళిపాళ.వాయిస్ బాగుంటుందని అందరూ అంటుండేవారు.అలా నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది.
చివరకు వంద ఆడిషన్లకు హాజరైన తరువాత 2016లో అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0(Anurag Kashyap Raman Raghav 2.0) లో అవకాశం వచ్చింది అని ప్పుకొచ్చింది.ఆ తరువాత తనను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ ఐశ్వర్యరాయ్ పక్కన యాడ్‌లో నటించ మనడంతోపాటు, తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని ఆఫర్ కూడా చేసినట్లు ఆమె తెలిపింది.ఇకపోతే శోభిత ఇటీవలే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే.