మేం చాలా రిచ్, శ్రీమంతులం.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.ఈ హీరో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా శ్రీమంతుడే.

 Mahesh Babu About Financial Issues Of His Father , Mahesh Babu , His Father , Fi-TeluguStop.com

ఆ విషయాన్ని తాజాగా అతనే వెల్లడించాడు.చిన్నతనం నుంచి తమకు అవసరాలకు మించిన డబ్బు ఉండేదని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తనకు తెలియవు మహేష్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ చిన్న కొడుకు.1979లో ‘నీడ’ సినిమాలో చిన్న పాత్రలో నటించి సినీ జీవితాన్ని ప్రారంభించాడు.అప్పటికి ఆయన వయసు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే.

బాల నటుడిగా మొత్తం ఎనిమిది సినిమాల్లో నటించాడు.

ఈ సినిమాలన్నీ తన తండ్రి నటించమని చెబితేనే నటించాడు.మహేష్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం కూడా ఉండేది.

తాను నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయా? ఫ్లాప్ అవుతున్నాయా? అనేది చూసుకోకుండా అతను నటించేవాడు.వాస్తవానికి ఆ సమయంలో అతనికి సినిమాల హిట్, ఫ్లాప్ గురించి తెలియదు.

నటించడం ఒకటే బాగా నేర్చుకున్నాడు.అయితే ఇలా సినిమాల్లో నటిస్తుంటే ఒక సంవత్సరం అనేది వేస్ట్ అయిపోయింది.

అంటే అతను ఒక సంవత్సరం పాటు చదువుకోలేకపోయాడు.ఇది గమనించిన సూపర్ స్టార్ కృష్ణ ( Superstar Krishna )”ఇక నటించింది చాలు, చదువు మీద దృష్టి పెట్టు.చదువు పూర్తయిన తర్వాతనే సినిమాల్లో మళ్ళీ నటించు.” అని చెప్పారట.మహేష్ బాబు అందుకు “సరే, నాన్న” అని చెప్పి బాగా చదువుకున్నాడు.తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు.

Telugu Financial, Mahesh Babu, Maheshbabu, Krishna, Tollywood-Movie

1999లో ‘రాజకుమారుడు’ ( Rajakumarudu )సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు.ఈ సినిమాలో బాగా నటించినందుకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్ గా నంది అవార్డు కూడా లభించింది.2001లో వచ్చిన ‘మురారి’ సినిమాతో( Murari ) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన ‘ఒక్కడు’ సినిమాతో ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నాడు.‘అతడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో మరపురానివి.

Telugu Financial, Mahesh Babu, Maheshbabu, Krishna, Tollywood-Movie

అయితే ఇంటర్వ్యూలో మహేష్ బాబు తాము శ్రీమంతులం అన్నట్లు మాట్లాడాడు.“మీ నాన్న సినిమాల వల్ల లాస్‌లు వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మీరు ఫీల్ అయ్యేవారా?” అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మహేష్ బాబును ప్రశ్నించారు.దీనికి మహేష్ ఆన్సర్ చెప్తూ.“అసలు ఫైనాన్షియల్ కండిషన్‌కి, మాకూ ఎలాంటి సంబంధం లేదు.మేమేం చాలా రిచ్.మాకు ఎప్పుడూ అవసరాలకు మించిన డబ్బు ఇంట్లో ఉండేది.” అని అన్నాడు.అంటే “మీరు శ్రీమంతుడు అన్నమాట” అని అనగా దానికి నవ్వుతూ అలాగే అన్నట్లు ఆయన సమాధానం ఇచ్చాడు.కృష్ణ ఎప్పుడూ మనీకి సంబంధించిన టెన్షన్స్‌ను ఇంటికి తీసుకొచ్చేవారు కాదని, ఎప్పుడూ తమకు ఒక సూపర్ స్టార్ లాగానే కనిపించే వారిని మహేష్ క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube