ఖలిస్తాన్ ఉద్యమం : భారత సమగ్రతను గౌరవించాల్సిందే.. కెనడా మంత్రి సంచలన వ్యాఖ్యలు

కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు ( Supporters of Khalistan )రోజురోజుకి రెచ్చిపోతున్నారు.ఇప్పటికే భారత వ్యతిరేక ర్యాలీలు, ఖలిస్తాన్‌కు మద్ధతుగా రెఫరెండాలు నిర్వహిస్తూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

 Canada Minister David Morrison About Pro-khalistan Radicals , Pro-khalistan Ra-TeluguStop.com

హిందువులు, నాన్ సిక్కులను టార్గెట్ చేసుకుని వారి ఆధ్యాత్మిక కేంద్రాలపై దాడులకు దిగుతున్నారు.ఈ ఘటనలపై పలుమార్లు భారత ప్రభుత్వం కెనడా దృష్టికి తీసుకొచ్చినా చర్యలు శూన్యం.

ఇప్పటికే హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ఏజెంట్లు ఉన్నారన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ భారతదేశ సమగ్రతకు మద్ధతునిస్తున్నట్లు మాట్లాడారు.

Telugu Canadadavid, Canadianprime, Hardeepsingh, Karan Brar, Prokhalistan-Telugu

ఒట్టావాలోని ఫారిన్ ఇంటర్‌ఫియరెన్స్ కమీషన్( Foreign Interference Commission ) ఎదుట హాజరైన మోరిసన్ మాట్లాడుతూ.భారతదేశ ప్రాదేశిక సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలన్నారు.కెనడాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలను కూడా ఆయన ప్రస్తావించారు.వాటిని భయంకరమైనవే అన్నప్పటికీ చట్టబద్ధమైనదిగా మోరిసన్ పేర్కొన్నారు.సిక్కు వేర్పాటువాదులు కెనడాతో పాటు పలు దేశాలలో ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.కెనడా – ఇండియాలు దశాబ్థాల నుంచి భాగస్వాములని .కెనడా దాని విధాన రూపకల్పనలో ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుంటుందని మోరిసన్ చెప్పారు.

Telugu Canadadavid, Canadianprime, Hardeepsingh, Karan Brar, Prokhalistan-Telugu

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28), అమన్‌దీప్ సింగ్ (22) అనే భారతీయులను నిజ్జర్ కేసులో కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ దర్యాప్తు ఫలితాల కోసం కెనడా ప్రభుత్వం ఉత్కంఠగా వెయిట్ చేస్తోంది.

గత వారం ఆర్‌సీఎంపీ డిప్యూటీ కమీషనర్ మార్క్ ఫ్లిన్ మీడియాతో మాట్లాడుతూ.నిజ్జర్ హత్యపై భారత్ జోక్యంపై కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక పరిశోధనలు చేస్తోందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube