జీవితంలో మనం ఊహించని సంఘటనలు ఒక్కోసారి జరుగుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి.అలాంటి ఒక ఇన్సిడెంట్ 70 ఏళ్ల టిజీ హాడ్సన్( Tizi Hodson ) అనే మహిళకి జరిగింది.ఆమె దాదాపు 50 ఏళ్ల క్రితం పంపిన ఓ జాబ్ రిక్వెస్టింగ్ లెటర్ తిరిగి ఆమె వద్దకు చేరింది.1976 జనవరిలో ఆమె మోటార్‌సైకిల్ స్టంట్ రైడర్‌గా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ లేఖ దాదాపు 50 ఏళ్లు పోస్టాఫీసు( Staines Post Office )లోని ఒక డ్రావర్ వెనుక పడి అలాగే ఉండిపోయింది, ఇప్పుడు అది ఆమెకు చేరింది.“స్టేన్స్ పోస్టాఫీసు ద్వారా ఆలస్యంగా వచ్చిన లేఖ.ఒక డ్రావర్ వెనుక దొరికింది.దాదాపు 50 ఏళ్లు ఆలస్యమైంది” అని లేఖతో పాటు వచ్చిన ఒక నోట్‌లో రాశారు.
అంటే ఆమె పోస్ట్ డబ్బాలో వేసింది కానీ అది వెనక పడిపోయింది.దాన్ని ఎవరూ చూడలేదు.అలాగే అది ఉండిపోయింది.చివరికి చూసి దానిని తిరిగి ఆమెకు పంపించడం జరిగింది.
ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఆమె యవ్వనంలోని జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది.“నాకు ఎందుకు జవాబు రాలేదో నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాను.ఇప్పుడు దానికి కారణమేంటో నాకు అర్థమైంది” అని మిస్ హాడ్సన్ బీబీసీకి చెప్పింది.టిజీ హాడ్సన్, ఆ ఉద్యోగ అభ్యర్థన లేఖను లండన్( London)లోని తన ఫ్లాట్‌లో టైప్ చేస్తూ, ఎంతో ఆశగా జవాబు కోసం ఎదురు చూసిందట.“రోజూ పోస్ట్ చెక్ చేసేదాన్ని.కానీ ఏమీ రాలేదు.నేను మోటార్‌సైకిల్ స్టంట్ రైడర్‌గా ఉండాలని ఎంతో కోరుకున్నాను కాబట్టి చాలా నిరాశ చెందాను” అని ఆమె తెలిపింది.“ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ లేఖ తిరిగి చేరడం చాలా ఆనందంగా ఉంది” అని కూడా ఆమె పేర్కొన్నది.
ఆ ఉద్యోగం ఎందుకు రాలేదని ఆమె డిసప్పాయింట్ అయింది కానీ టిజీ హాడ్సన్ తన జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించింది.ఆఫ్రికాకు వెళ్లి, పాములను అదుపు చేసే వ్యక్తిగా, గుర్రాలను శిక్షణ ఇచ్చే వ్యక్తిగా పనిచేసింది.అంతేకాకుండా, ఎయిరోబ్యాటిక్ పైలట్‌గా, ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా వర్క్ చేసింది.ఆ రోజుల్లో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉండేవి, అందుకే తాను మహిళ అని ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె వెల్లడించింది.”ఎన్ని ఎముకలు విరిగినా పర్వాలేదు, నేను అందుకు అలవాటుపడిపోయాను” అని ఆమె ఉద్యోగానికి అప్లై చేసినా కంపెనీకి చెప్పానని టిజీ హాడ్సన్ గుర్తు చేసుకుంది.ఇప్పుడు తిరిగి ఆలోచిస్తే, తన జీవితం చాలా అద్భుతంగా గడిచిందని ఆమె చెప్పుకొచ్చింది.