ఢిల్లీలో పవర్ చూపించిన బాబు.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విడుదల

కేంద్రంలోని బిజెపి ( Bjp )ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో బలం లేకపోవడంతో , ఏపీలో టిడిపి మద్దతు కీలకం అయింది.  ఈ నేపథ్యంలోనే ఏపీకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ సీఎం చంద్రబాబు( CM Chandrababu) కోరిన వెంటనే నిధులు విడుదల చేస్తూ ప్రాధాన్యం ఇస్తోంది కేంద్ర అధికార పార్టీ బిజెపి.

 Center Released 2800 Crores For Polavaram Project At Once, Babu Who Showed Powe-TeluguStop.com

ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న చంద్రబాబు మరోసారి ఏపీకి సంబంధించి ప్రాజెక్టుల విషయంపై బిజెపి పెద్దలతో సమావేశం అయ్యారు.

Telugu Ap, Chandrababu, Cmchandrababu, Delhi, Janasena-Politics

ప్రధాని నరేంద్ర మోది ( Narendra Modi )తో చంద్రబాబు భేటీ అయ్యారు.ఏపీకి సంబంధించిన అనేక అంశాల పైన చర్చించారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించగా,  పోలవరం ప్రాజెక్టు కోసం ఒకేసారి 2800 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

వీటిలో 2000 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు సమాచారం .ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.వాస్తవంగా కొద్దిరోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గం పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసింది.దీనిలో భాగంగానే పోలవరం పనుల కోసం రెండు వేల కోట్లను అడ్వాన్స్ గా విడుదల చేసింది .వీటితోపాటు రియంబర్స్మెంట్ కింద 800 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

Telugu Ap, Chandrababu, Cmchandrababu, Delhi, Janasena-Politics

దీంతో పోలవరం ప్రాజెక్టుకు 2800 కోట్లు నిధులు విడుదలయ్యాయి .ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాగా ఊరటనిచ్చే అంశమే.2014 లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు.అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులను ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే,  ఆ తర్వాత కేంద్రం ఆ మొత్తాన్ని రీయంబర్స్ చేస్తోంది.దశలవారీగా ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తోంది.

అయితే కొంతకాలంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న పరిణామాలు , ఒక సీజన్ నష్టపోకుండా పనులు చేయాలంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో సానుకూలంగా స్పందించిన కేంద్ర బీజేపీ పెద్దలు నిధులను విడుదల చేశారు.కేంద్రంలో బిజెపికి టిడిపి మద్దతు కీలకమైన నేపథ్యంలో చంద్రబాబు ఏపీకి సంబంధించిన ఏ విజ్ఞప్తి చేసిన తక్షణమే కేంద్ర బీజేపీ పెద్దలు స్పందిస్తూనే వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube