సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక మందన( Rashmika Mandanna ) జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి అయిపోగా కేవలం ఒకే ఒక పాట ఐటమ్ సాంగ్ ఉండడంతో దాన్ని చిత్రీకరిస్తున్నారు మూవీ మేకర్స్.
ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయడం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ల విషయం హాట్ టాపిక్ గా మారింది.విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాపై ఒక్కో అప్డేట్ ని విడుదల చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వాడితో వైరల్ గా మారింది.అదేమిటంటే.హీరోయిన్ రష్మిక మందన హీరో అల్లు అర్జున్ కి ఒక క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంద.ఇందుకు సంబంధించిన ఫోటోని ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశారు బన్నీ.
ఎవరికైనా వెండి బహుమతిగా( Silver Gift ) ఇస్తే వాళ్లకు అదృష్టం( Luck ) కలిసొస్తుందని మా అమ్మ చెప్పేది.ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్ మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను.మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు అని రష్మిక మందన్న రాసుకొచ్చింది.ఇప్పుడు చాలా అదృష్టం కావాలి డియర్ అని పుష్ప 2 గురించి పరోక్షంగా ప్రస్తావించాడు అల్లు అర్జున్.
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న విడుదల కాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.