అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) నవంబర్ 13న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో( Joe Biden ) భేటీ కానున్నారు.ఓవల్ కార్యాలయంలో ఆరోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం సమావేశానికి రావాల్సిందిగా ట్రంప్‌ను బైడెన్ ఆహ్వానించినట్లుగా శ్వేతసౌధం( White House ) ఓ ప్రకటనలో తెలిపింది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని ప్రస్తుత అధ్యక్షుడు ఆహ్వానించడం ఎప్పుడూ జరిగేదే.
అయితే సాంప్రదాయానికి విరుద్ధంగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌ను ట్రంప్ ఆహ్వానించలేదు.తనదే విజయమంటూ కోర్టులెకెక్కి నానా హంగామా సృష్టించారు.
కానీ బైడెన్ సాంప్రదాయాలను గౌరవిస్తూ తాజా ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు.
ఇక అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.( US Congress ) క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.
భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.
వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఇదిలాఉండగా.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన నెవాడా( Nevada ) ట్రంప్ ఖాతాలో పడింది.ఆ రాష్ట్రంలోని 6 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ కైవసం చేసుకోవడంతో నెవాడా రిపబ్లికన్ల చేతికి చిక్కింది.గత ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్ధతుగా నిలిచిన ఈ రాష్ట్రం తాజాగా రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపింది.2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ చివరిసారిగా నెవాడాలో గెలిచారు.అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అరిజోనా కూడా ట్రంప్ ఖాతాలో వచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ట్రంప్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 312కి చేరుకున్నాయి.ఆయన పాపులర్ ఓట్ల సంఖ్య కూడా దాదాపు 39 లక్షలకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.