జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Hyper Aadi ) మల్టీ టాలెంటెడ్ అని చెప్పవచ్చు.కామెడీ చేయడమే కాకుండా కామెడీ స్క్రిప్ట్ లు( Comedy Scripts ) రాయడంలో కూడా ఇతడికి మంచి టాలెంట్ ఉంది.
తన సొంత జబర్దస్త్ టీమ్ కోసం( Jabardasth ) అందరికీ డైలాగులు, స్క్రిప్ట్ రాసిచ్చేది ఇతడే.ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.
తెలియని విషయం ఏంటంటే ప్రముఖ డ్యాన్స్ షో ఢీకి( Dhee Show ) కూడా హైపర్ ఆది నే స్క్రిప్ట్ అందిస్తాడట.ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అతనే ఒప్పుకున్నాడు.
కామెడీ స్క్రిప్టులు రాసేటప్పుడు చాలా కష్టపడాలని అన్నాడు.అవి రాసేటప్పుడు తాను కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటానని చెప్పుకొచ్చాడు.ఒకరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వారు డైలాగులు చెప్పే తీరు ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్‌గా వారు డైలాగ్ చెప్తారు, ఎలాంటి పంచులు వేస్తారు, వారి నోటి నుంచి ఏ డైలాగులు వస్తే బాగా పండుతాయి ఇవన్నీ ఆలోచించి తాను తగిన స్క్రిప్ట్ రాస్తానని ఆది ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

సుడిగాలి సుధీర్,( Sudigali Sudheer ) చలాకీ చంటి,( Chalaki Chanti ) రష్మీ గౌతమ్,( Rashmi Gautam ) ప్రదీప్ మాచిరాజు( Pradeep Machiraju ) ఇలా అందరికీ తానే కామెడీ స్క్రిప్ట్, డైలాగులు రాసిస్తానని అతను పేర్కొన్నాడు.“నా షో నా ఇష్టం” నుంచి ఢీ వరకు తాను ఎన్నో ఈటీవీ, మల్లెమాల షోలకు స్క్రిప్టులను అందించానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.సినిమా చూపిస్త మామ షోలో గెటప్ శీను కి కూడా తాను స్క్రిప్ట్ అందించినట్లు పేర్కొన్నాడు.

ఇకపోతే ఆది బీటెక్ చదువుకున్నాడు.ఇంజనీరింగ్ చేసాక ఉద్యోగంలో చేరి కెరీర్‌ను ప్రారంభించాడు.షార్ట్ ఫిల్మ్‌లో కనిపించిన తర్వాత అదిరే అభి అతడి ప్రతిభను చూసి జబర్దస్త్ కి పిలిపించాడు.జబర్దస్త్ లో కామెడీ చేసే అవకాశం వచ్చాక ఉద్యోగం మానేసి బుల్లితెరపై నటించడం ప్రారంభించాడు.
మొదట రిక్షా లాగే సీన్ నుంచి ఆ తర్వాత టీం లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు.స్కిట్‌లు, వ్యంగ్య జోకులు, స్పాంటేనియస్ పంచులు పేలుస్తూ ఆది కాస్తా ‘హైపర్’ ఆదిగా పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మూవీలో నటించిన ప్రారంభించాడు.2024 లో విడుదల కానున్న పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాలో కూడా ఈ నటుడు కనిపించనున్నాడు.