వరల్డ్ టూర్ కోసం జాబ్ మానేసింది, ఇల్లు అమ్మేసింది.. కట్ చేస్తే..?

ప్రపంచం మొత్తం తిరిగేయాలని, జీవితకాలపు జ్ఞాపకాలను ఏర్పరుచుకోవాలని చాలామంది అనుకుంటారు.కానీ ఆ కలను నెరవేర్చుకోవడానికి ధైర్యం చేసేవారు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు.

 Us Woman Quits Job And Sells House To Fund World Tour But Then This Happens Deta-TeluguStop.com

అలాంటి వారిలో ఫ్లోరిడాకు( Florida ) చెందిన మెరెడిత్ షే( Meredith Shay ) అనే మహిళ కూడా చేరారు.ఆమె తన ప్రపంచ పర్యటన( World Tour ) కలను నిజం చేసుకోవడానికి చాలా సాహసం చేసింది.

ఓ విశాలమైన ఓడలో( Cruise ) ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధమైంది.ఈ ప్రత్యేకమైన పర్యటన పేరు ‘లైఫ్ ఎట్ సీ’.( Life At Sea ) ఈ పర్యటనలో భాగంగా, మెరెడిత్‌తో పాటు మరో వెయ్యి మంది ప్రయాణికులు మూడు సంవత్సరాల పాటు 135 దేశాలను సందర్శించనున్నారు.

ఈ అద్భుత అవకాశం కోసం మెరెడిత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన ఇంటిని కూడా అమ్మేసింది.

అంతేకాదు, ఈ పర్యటనకు కావాల్సిన డబ్బును ఆదా చేసుకోవడానికి ఆమె కొంతకాలం రోడ్డుపైనే గడిపింది.ఈ పర్యటనకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.గత ఏడాది ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెరెడిత్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.ఈ పర్యటనలో భాగంగా ఆమె ఓడలోని ఏడవ అంతస్తులో ఉన్న బాల్కనీ క్యాబిన్‌ను బుక్ చేసుకుంది.

Telugu Adventure, Bahamas, Sea, Meredith Shay, Miami, Cruise Company, Myre Cruis

ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఈ మూడు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని తిరుగుతూ ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంది.ఈ ప్రత్యేకమైన పర్యటన గురించి తెలిసిన వెంటనే టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి, 12 గంటల్లోనే తన కలను నిజం చేసుకుంది.ఆమె నాలుగు సూట్‌కేసులు ప్యాక్ చేసి, ఇంటిని అమ్మి, తన వస్తువులను స్టోరేజ్ యూనిట్‌లో ఉంచింది.అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆమెకు షాకింగ్ న్యూస్ అందింది.

ఆ ఓడ ముందుగా మియామి నుంచి బయలుదేరాలి అనుకున్నారు.కానీ, ఓడ యజమానులు అకస్మాత్తుగా బహామాస్ నుంచి బయలుదేరుతామని ప్రకటించారు.

కొద్ది రోజుల తర్వాత, మరో షాకింగ్ న్యూస్ వచ్చింది.ఆ పర్యటనే రద్దు చేయబడిందని తెలిసింది.

Telugu Adventure, Bahamas, Sea, Meredith Shay, Miami, Cruise Company, Myre Cruis

“లైఫ్ ఎట్ సీ” ఓడ ప్రయాణం రద్దయినందుకు కారణం గురించి “మై క్రూయిజ్” కంపెనీ యజమాని వేదత్ ఉగ్రులు వివరణ ఇచ్చారు.గత అక్టోబర్ 7న మధ్యప్రాచంలో జరిగిన ఒక సంఘటన వల్ల కంపెనీకి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.కస్టమర్లకు మూడు విడతల్లో డబ్బు తిరిగి ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.ఇంత పెద్ద నష్టం వాటిల్లినప్పటికీ, రోడ్డుపై కూడా జీవించినప్పటికీ, మెరెడిత్ షే మాత్రం పాజిటివ్ గానే ఉంది.

తాను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నానని, ఎలాంటి బాధ్యతలు లేవని ఆమె చెప్పింది.మరొక క్రూయిజ్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్న ఆమె, సౌదీ అరేబియా, దుబాయ్‌లను సందర్శించాలని ప్లాన్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube