ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఉపముఖ్యమంత్రి అయ్యారు.ఇక ఆయన సోదరుడు నాగబాబు( Nagababu ) కూడా జనసేన పార్టీ కార్యకలాపాలను ఎంతో చక్కగా నిర్వహించడమే కాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఎంతో మద్దతు తెలియజేస్తూ తన వెంటే ఉండడమే కాకుండా తన విజయానికి కూడా కారణమయ్యారు.
ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో నాగబాబు పాత్ర ఎంతగానో ఉందని చెప్పాలి.ఈ క్రమంలోనే తన అన్నకు కూడా పవన్ కళ్యాణ్ కీలక పదవి అందించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే నాగబాబు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలలో నిజం లేదని స్పష్టత వచ్చింది.అయితే ప్రస్తుతం రాజ్యసభలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి నాగబాబు పెద్దల సభకు వెళ్లబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల పట్ల తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్( Varun Tej ) స్పందించారు.మట్కా సినిమా( Matka Movie ) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈయనకు ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ నాన్న గతంలో ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసిన ప్రస్తుతం జనసేన పార్టీ కోసం పనిచేసిన కూడా ఎలాంటి పదవులను ఆశించి పని చేయలేదని తెలిపారు.నాన్నకు పదవిలో కొనసాగడం కంటే కూడా తన కుటుంబ సభ్యులు మంచి స్థానంలో ఉంటేనే ఆనందమని నాన్నకు ఎలాంటి పదవి ఆశలు లేవని తెలిపారు.గతంలో నాన్న నర్సాపురంలో పోటీ చేసి ఓడిపోయిన ఎప్పుడు బాధపడలేదు ఇటీవల అమలాపురం ఎంపీ పోటీ నుంచి తప్పుకున్న సమయంలో కూడా నాన్న బాధపడలేదు.
ఆయనకు పదవులు ముఖ్యం కాదు తన కుటుంబ సభ్యుల సంతోషమే ముఖ్యమని నాన్న ఆనందమే మా ఆనందం అంటూ వరుణ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.