సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి కస్తూరి శంకర్( Kasturi Shankar ) ఒకరు.ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అనంతరం పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన కస్తూరి శంకర్ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులు మెప్పిస్తున్నారు.
ఇక ఈమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి అలాగే సినిమా రాజకీయ విషయాల గురించి మాట్లాడుతూ తరచూ పోస్టులు చేస్తూ ఉంటారు.అయితే కొన్నిసార్లు ఈమె చేసే వ్యాఖ్యల కారణంగా వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.ఇటీవల తెలుగు వారి గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు తనని తీవ్ర వివాదంలోకి నెట్టివేశాయి.ఈమె గురించి విమర్శలు వస్తున్న తరుణంలో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే( DMK ) వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది.
ఇలా తన పట్ల ఈ వివాదం జరుగుతుండగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి.ఈమె వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగులు( Revenue Employees ) ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈమెపై కేసు నమోదు చేయడంతో పోలీసులు తనకు సమన్లు జారీ చేయడం కోసం వెళ్లారు.అయితే ఈమె తన ఇంటికి తాళం వేసి ఉండడమే కాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఈమె పరారీలో ఉన్నారని బహుశా ఈమె చెన్నై వదిలి వెళ్లిపోయింది అంటూ పోలీసులు భావిస్తున్నారు.ఇక ఈమె కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తుంది.