వృద్ధుడితో అఫైర్ పెట్టుకున్న ఆస్ట్రేలియన్ యువతి.. అతడిలో నచ్చింది ఇదేనట ..

సాధారణంగా కొందరు యువకులు ఆంటీలకు అట్రాక్ట్ అవుతారని అంటుంటారు.యువతులు మాత్రం అందుకు భిన్నం.

 Australian Woman Reveals Positives Of Having An Older Partner Details, Age Gap R-TeluguStop.com

వారు తమ వయసు వారితో లేదంటే నాలుగైదు ఏళ్లు పెద్దవారైన వారితో రిలేషన్‌షిప్‌లో ఉండడానికి ఇష్టపడతారు.మరీ ఓల్డ్ ఏజ్డ్‌ పీపుల్ వారికి అసలు నచ్చరు.

కానీ కొంతమంది మహిళలు మాత్రం మిగతా అమ్మాయిలకు భిన్నంగా నడుచుకుంటున్నారు.మెల్‌బోర్న్‌కు( Melbourne ) చెందిన మోడల్ నోవా హౌథ్రోన్ (29)( Nova Hawthorne ) అలాంటి కోవలోకే వస్తుంది.

ఈ ముద్దుగుమ్మ తన కంటే 34 ఏళ్లు పెద్ద జేమ్స్‌తో( James ) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉంది.

Telugu Agegap, Australia, Blind Love, Compatibility, Love, Maturity, Melbourne,

వీరిద్దరూ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు.జేమ్స్ తనకు బహుమతులు ఇచ్చి, ప్రత్యేకంగా భావించేలా చేసేవాడట.అందుకే ఆయన ప్రేమ వలలో పడానని నోవా చెబుతోంది.

కాలక్రమేణా, వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఇప్పుడు వయసు తేడా( Age Gap ) వారి సంబంధాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదు.

నోవా మాట్లాడుతూ, “మేం మొదటిసారి కలిసిన రోజు నుంచే మా మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఏర్పడింది.ఆయన నన్ను ఎంతో అర్థం చేసుకున్నారు.

మేం ఒకరికొకరు ఎంతో సరిపోతాము” అని చెప్పింది.

Telugu Agegap, Australia, Blind Love, Compatibility, Love, Maturity, Melbourne,

నోవా తన కంటే వయసులో పెద్దవాడైన జేమ్స్‌తో చాలా ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసేదట.ఈ చర్చల సమయంలో ఆయనపై తనకు మరింత ప్రేమ పెరిగిందని నోవా చెప్పింది.వాతావరణం, రాజకీయాలు, సమాజం, న్యాయం, అన్యాయం వంటి విషయాల గురించి వారు చాలా చర్చలు చేసేవారు.

ఈ చర్చల ద్వారా జేమ్స్ చాలా మంచి మనసు గల వ్యక్తి అని, తనకు సరిపోయే వ్యక్తి అని నోవాకు అర్థమైందట.ఆయన తెలివితేటలు, దయ గుణాలే ఆమెను ఆకర్షించాయి.

నోవా మన కంటే చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తులను ప్రేమించడంలో అత్యంత ఆనందంగా అనిపిస్తుందని ఆమె చెప్పింది.జేమ్స్‌ చాలా పరిణతి చెందిన వ్యక్తిలా, నిజమైన మనిషిలా ప్రవర్తిస్తారని ఆమె చెప్పింది.

ట్రాఫిక్ గురించి ఫిర్యాదు చేసే సమయం మినహా, ఆయన ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడట.ఆయన చాలా నిజాయితీగా ఉంటారు, తన భావాలతో ఆడుకోడట.

ఆయన ఆమెకు గురువులాగా ఉంటున్నాడట.ఆయన తనకు అత్యంత విలువైన బహుమతిగా ఇచ్చినది జ్ఞానమే అని నోవా చెప్పింది.

ఆయన కారణంగానే తనకు నమ్మకం పెరిగింది, తాను ఎలా జీవించాలో తెలుసుకున్నానని ఆమె చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube