స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) త్వరలో పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను బన్నీ సొంతం చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆడపిల్లలకు అన్యాయం జరిగితే( Injustice To Women ) కోపం వస్తుంది అంటూ అన్ స్టాపబుల్ షోలో( Unstoppable Show ) బన్నీ కామెంట్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
![Telugu Akhanda, Allu Arjun, Alluarjun, Balakrishnaallu, Pushpa, Unstoppable Nbk- Telugu Akhanda, Allu Arjun, Alluarjun, Balakrishnaallu, Pushpa, Unstoppable Nbk-](https://telugustop.com/wp-content/uploads/2024/11/bunny-sensational-comments-about-womens-justice-detailsa.jpg)
తాను అఖండ3( Akhanda 3 ) సినిమాలో నటిస్తానని మీరు పుష్ప3( Pushpa 3 ) సినిమాలో నటించాలంటూ బన్నీ సరదాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.బాలయ్య అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఈ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.నేను కృష్ణుడిని నువ్వు అర్జునుడు అని బాలయ్య చెప్పగా మీరు గీత ఇవ్వండి నేను కురుక్షేత్రం చేస్తానంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉంది.
![Telugu Akhanda, Allu Arjun, Alluarjun, Balakrishnaallu, Pushpa, Unstoppable Nbk- Telugu Akhanda, Allu Arjun, Alluarjun, Balakrishnaallu, Pushpa, Unstoppable Nbk-](https://telugustop.com/wp-content/uploads/2024/11/bunny-sensational-comments-about-womens-justice-detailss.jpg)
మీ మ్యాన్షన్ లో హౌస్ పార్టీ చేసుకుందామని బన్నీ అన్నారు.బెస్ట్ యాక్టర్ కింద తెలుగు యాక్టర్ కు నేషనల్ అవార్డ్( National Award ) ఎవరికీ రాకపోవడం బాధేసిందని ఆ అవార్డ్ కొట్టాలని అనిపించిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.యాక్షన్ ఇష్టమా రొమాన్స్ ఇష్టమా అని అడగగా బొక్కలో యాక్షన్ అంటూ బన్నీ కామెంట్ చేశారు.
మా అమ్మను దేనితో కొట్టలేదని అడగాలని బన్నీ అన్నారు.బన్నీ తల్లి కూడా ఈ షోకు హాజరయ్యారు.
ఆడపిల్లలకు అన్యాయం జరిగితే కోపం వస్తుందని బన్నీ తెలిపారు.డ్యాన్స్ లో మీరే నంబర్ అని నువ్వు అనుకుంటావ్ అంటే మీరు చెబితే ఫిక్స్ అవుతానని బన్నీ కామెంట్స్ చేశారు.
ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.అయితే గెస్ట్ లను రిపీట్ చేస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.