ఇటీవల బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఛత్ పూజ పండుగను( Chhath Puja ) చాలా ఘనంగా జరుపుకున్నారు.ముఖ్యంగా మహిళలు ఈ పూజలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
అయితే ఛత్ పూజ నిర్వహిస్తున్న ఒక మహిళ వద్దకు అనుకోకుండా ఒక విషపూరితమైన సర్పం( Poisonous Snake ) వచ్చింది.దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ వీడియోలో, నదిలో నిలబడి సూర్య దేవుడిని పూజిస్తున్న ఆ మహిళ పాదాల దగ్గర అకస్మాత్తుగా ఒక సర్పం కనిపించింది.అయినప్పటికీ, ఆ మహిళ అస్సలు భయపడకుండా తన పూజను అలానే కొనసాగించింది.ఆ సర్పం కూడా ఆమెను ఏమీ చేయకుండా తిరిగి వెళ్లిపోయింది.
ఈ మహిళ ప్రదర్శించిన ధైర్యం, భక్తిని చూసి ప్రజలు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.ఆమె పామును చూసి భయపడి అటు ఇటు పరిగెత్తినట్లయితే అది కచ్చితంగా కాటేసి ఉండేది.
అదృష్టవశాత్తు ఆమె ఎలా చేయలేదు దేవుడిపై భారం వేసి అలానే ధైర్యంగా నిల్చుని ఉంది.పొరపాటున వాటికి దగ్గరగా వెళ్ళినా, లేదా వాటి సమీపంలో ఉన్నా స్థిరంగా నిల్చుకోవాలి.
పాములు( Snakes ) స్థిరంగా నేర్చుకుని ఉంటే ఏమీ చేయవని నిపుణులు చెబుతుంటారు.ఏదైనా కదలికలు గమనిస్తేనే ప్రమాదం పొంచి ఉందో అని అవి భయపడి దాడి చేస్తుంటాయి.
పాము కనిపించినా భయపడకుండా ఛత్ పూజ చేసిన ఆ మహిళ ధైర్యాన్ని నెటిజన్లు బాగా పొగిడేస్తున్నారు.ఆమెకు దేవుడి ఆశీర్వాదం ఉందని కొందరు భావిస్తున్నారు.“చాలా విషయాలు మన అవగాహనకు మించినవే” అని ఒకరు కామెంట్ చేస్తే, “జై ఛత్ మైయ్య” అని మరికొందరు కొనియాడుతున్నారు.“దాదా ప్రణామ్.మాత ఛత్ ఆశీర్వాదం అందరికీ శాంతిని ప్రసాదించాలి.” అని మరొకరు కోరుకున్నారు.
ఛత్ పూజ ఎంతో కఠినమైన వ్రతం.భక్తులు 36 గంటలు ఉపవాసం ఉండి, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో సూర్య భగవానుడిని పూజిస్తారు.ఈ పూజలో అనేక కష్టాలు ఎదురైనా భక్తులు ధైర్యంగా ఎదుర్కొంటారు.ఈ వీడియో ద్వారా ఆ భక్తిని మనం స్పష్టంగా చూడవచ్చు.