సినిమా రంగం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము.మంచి సినిమాలు రావాలే కానీ ప్రజలు సినిమాలను నెత్తిన పెట్టుకుంటారు.
కానీ ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ నే అంతా గొప్పగా చెప్పుకునేవారు.మరీ బాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలు అయితే సౌత్ ఇండస్ట్రీ అంటేనే పట్టించుకునే వారు కాదు.
దీనికి కారణం వారిలా మనము సినిమాలు తీయలేము అన్న భావన బలంగా పాతుకుపోయి ఉండేది.ఏదో అడపా దడపా మంచి సినిమాలు వచ్చినా వాటిని కేవలం లోకల్ సినిమాలుగానే భావించేవారు.
మన స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్లిన తగిన గుర్తింపు దక్కేది కాదు.ఎక్కడకు వెళ్లినా అవమానం తోనే తిరిగి వచ్చే వారు.
ఈ విషయాన్ని చాలా సార్లు మన స్టార్లు వేదికల మీద చెప్పుకుని బాధపడేవారు.కట్ చేస్తే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు సౌత్ సినిమా అంటేనే బాలీవుడ్ వర్గాలు కుల్లుకుని చస్తున్నాయి.
కేవలం గత కొంత కాలంగా చూస్తే ఆర్ ఆర్ ఆర్, పుష్ప, కేజిఎఫ్ చాప్టర్ 2 లాంటి సినిమాలు బాలీవుడ్ లో తమను తాము ప్రశ్నించుకునే పరిస్థితిని తీసుకు వచ్చాయి.
ఈ సినిమాలు సాధించిన కలెక్షన్ లు అలాంటివి మరీ.బాలీవుడ్ లో అక్కడ సినిమాలు కలెక్షన్ లు సాధించలేక చతికిలబడుతుంటే, సౌత్ సినిమాలు మాత్రం అక్కడ రిలీజ్ అయ్యి కలెక్షన్ ల ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి.ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ దాదాపుగా పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నారు.ఇప్పుడు ఇండియన్ సినిమా సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటోంది.బాలీవుడ్ మాత్రం అలంటి సినిమాలను తీయడంలో విఫలం అవుతోంది అని హీరోలు, సీనియర్ డైరెక్టర్ లు తిట్టిపోస్తున్నారు.ఈ విధంగా బాలీవుడ్ ను టాలీవుడ్ డామినేట్ చేస్తోంది.
అయితే ఈ విజాయ్న్ని జీర్ణించుకోలేని కొందరు పేరున్న బాలీవుడ్ హీరోలు సౌత్ స్టార్స్ పై అసూయతో నోరు జారుతున్నారు.
కానీ వీటిపై ప్రత్యక్షముగా మనవాళ్ళు ఏమీ అనకపోయినా రామ్ గోపాల్ వర్మ లాంటి వారు వారిపై సెటైర్లు వేస్తున్నారు.ఇప్పుడు సరికొత్తగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచంలనంగా మారింది.కేవలం ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన ఇంతలా ప్రగల్భాలు పలకడం సరికాదని… ఇండస్ట్రీ అన్నాక గెలుపు ఓటమి సహజమని చెప్పారు.
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ హిట్ సినిమాలతో బాగుండొచ్చు మేము కాదనలేదు.కానీ బాలీవుడ్ లోనూ ఒక్క సరైన హిట్ పడితే అందరూ కామ్ గా ఉంటారు అంటూ మాట్లాడారు.
హీరో పంటి సినిమా ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న నవాజుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.సినిమా అంటే కేవలం మసాలా కంటెంట్ మాత్రం వుంటే సరిపోదన్నారు.ఇక ఈయనలా మాట్లాడిన వారిలో జాన్ అబ్రహం కూడా ఉన్నారు.
ఈయన మాట్లాడుతూ నేను ఒక హిందీ నటుడిని.కేవలం హిందీ సినిమాలో మాత్రమే నటిస్తానని… సౌత్ సినిమాను తక్కువ చేసి మాట్లాడారు.ఇక అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ సౌత్ సినిమాలు కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయ్యాయి.
మేము కాదనడం లేదు అంతమాత్రాన బాలీవుడ్ నుండి మంచి సినిమాలు రావడం లేదు అనడం కరెక్ట్ కాదు అన్నారు.ఇక ఇటువంటి పరిస్థితుల్లో హిందీ నటుడు మనోజ్ బజ్ పాయ్ సౌత్ సినిమాను పొగడడం షాకింగ్ గా మారింది.
ఇప్పటికైనా సౌత్ ను చూసి చాలా నేర్చుకోవాలని బాలీవుడ్ కు గట్టి చురకలు అంటించాడు.