మొదటి నుంచి అమరావతికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు టిడిపి(TDP) అధినేత ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu).దీనికి తగ్గట్టుగానే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి(Amaravati) లో వాస్తవ పరిస్థితి ఏమిటి? అనే దానిపైన అధ్యయనం చేయించారు.ఇక పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.ప్రపంచ బ్యాంకుతో పాటు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతి రూపురేకలు మార్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు సీఆర్డీఏకు(CRDA) ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.15 వేల కోట్ల రూపాయలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.15 వేల కోట్ల రూపాయలు నిధులతో ఏఏ పనులు ఎక్కడెక్కడ చేపట్టాలనే దానిపైన ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో పూర్తి స్థాయిలో అమరావతి పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ నిధులను వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అలాగే హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ ఉండేందుకు వీలైన విధంగా నిర్మాణాలను చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అమరావతిలో(Amaravati) మురుగునీటి కాలువల నిర్మాణాలతో పాటు , వరదనీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు నిర్మించాలని పేర్కొంది.సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది .నీటి రిజర్వాయర్లను నిర్మించాలని ఉత్తర్వులు పేర్కొంది.మూడేళ్లలో అమరావతి లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా అసెంబ్లీ , సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మించడంతో పాటు, తొమ్మిదో నెలలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు(Ministers), ఐఏఎస్(IAS) లకు సంబంధించి క్వార్టర్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి అలాట్మెంట్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు.దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్నారు.2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా అమరావతిలో నిర్మాణ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.