ప్రస్తుత వింటర్ సీజన్ (Winter season)లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దాదాపు ప్రతి ఒక్కరికి కత్తి మీద సాములా ఉంటుంది.చలి, పొడి గాలి, సరైన తేమ లేకపోవడం, వేడి వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తరచూ పొడి బారి పోతుంటుంది.
మృదుత్వాన్ని కోల్పోతుంది.చర్మం యొక్క మెరుపు సైతం మాయం అవుతుంది.
అయితే వింటర్ సీజన్ లోనూ సూపర్ గ్లోయింగ్ అండ్ సాఫ్ట్ స్కిన్ ను పొందాలని భావించేవారు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని(home remedy) తప్పకుండా ట్రై చేయండి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు పాలు (Milk)పోసుకోవాలి.పాలు హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు(Organic turmeric) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె (honey)వేసి రెండు నిమిషాలు మరిగించండి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన పాలును చల్లార పెట్టుకోండి.
పూర్తిగా కూల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్(Coffee powder), వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్(Sandalwood powder), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్(almond oil) వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోండి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని(home remedy) ప్రయత్నించడం వల్ల చర్మం సాఫ్ట్ గా మరియు సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.
పొడి చర్మం సమస్య దూరం అవుతుంది.అలాగే చర్మం పై ఏమైనా మొండి మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడతారు.మరియు ఈ సింపుల్ హోమ్ రెమెడీ చర్మ ఆరోగ్యానికి అండగా ఉంటుంది.
మొటిమల సమస్యకు కూడా అడ్డుకట్ట వేస్తుంది.