ప్రస్తుత వింటర్ సీజన్ లో సహజంగానే అందరి ఇమ్యూనిటీ సిస్టమ్(immune system) అనేది వీక్ గా మారుతుంది.దాంతో జలుబు, దగ్గు(Cold, cough) వంటి సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా మనపై ఎటాక్ చేస్తూ ఉంటాయి.
వాటిని తట్టుకుని నిలబడాలంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మల్టీ విటమిన్ టీ(Multi vitamin tea) అద్భుతంగా తోడ్పడుతుంది.
వింటర్ సీజన్ లో ఈ టీ ను మిస్ అవ్వకుండా తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకున్నట్లే అవుతుంది.మరి ఇంతకీ ఇమ్యూనిటీని పెంచే ఆ టీ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా గ్లాస్ జార్ తీసుకుని అందులో రెండు లెమన్ స్లైసెస్(Lemon slices), రెండు ఆరెంజ్ స్లైసెస్(Orange slices), మూడు టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు(Pomegranate seeds), నాలుగు లవంగాలు(cloves), అంగుళం దాల్చిన చెక్క(Cinnamon) వేసుకోవాలి.అలాగే వీటితో పాటు వన్ టీ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, ఐదారు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు ఒకటిన్నర గ్లాసు హాట్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి.
పది నిమిషాలకు టీ అనేది రెడీ అవుతుంది.స్ట్రైనర్ సహాయంతో టీ ని ఫిల్టర్ చేసుకుని తాగేయడమే.ఈ మల్టీ విటమిన్ టీ ను ప్రస్తుత చలికాలంలో ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ దృఢంగా మారుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
ఒకవేళ దరిచేరిన కూడా వాటి నుంచి వేగంగా రికవరీ అవ్వడానికి ఈ టీ అద్భుతంగా తోడ్పడుతుంది.
అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న టీ బద్ధకాన్ని వదిలిస్తుంది.
బాడీని ఉత్సాహంగా మారుస్తుంది.ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది.
శరీర బరువు నిర్వాహణలో సైతం ఈ టీ సహాయపడుతుంది.