తమ పాదాలు (feet)అందంగా తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు ఈ విషయంలో ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు.
ఎందుకంటే బయటకు బహిర్గతం అయ్యే శరీర భాగాల్లో పాదాలు కూడా ఒకటి.అయితే కొందరికి బాడీ మొత్తం ఒక రంగులో ఉంటే పాదాలు మాత్రం మరొక రంగులో ఉంటాయి.
డెడ్ స్కిన్ సెల్స్ (Dead skin cells)పేరుకుపోవడం, పాదాల సంరక్షణ లేకపోవడం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల పాదాలు నల్లగా అసహ్యంగా మారిపోతుంటాయి.
అటువంటి పాదాలు కలిగి ఉన్నవారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
తెల్లటి మృదువైన పాదాలను పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.ఒకవేళ మీరు కూడా ఈ లిస్టులో ఉంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ (Coffee powder)వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా(baking soda), వన్ టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ (white tooth paste)మరియు సరిపడా ఫ్రెష్ లెమన్ జ్యూస్(lemon juice) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం అర నిమ్మ చక్కతో ఐదు నిమిషాల పాటు పాదాలను బాగా రుద్ది వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
చివరిగా పాదాలను తడి లేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా బాదం నూనెను అప్లై చేసుకోవాలి.అలాగే ప్రతి రోజూ స్నానం చేశాక కూడా కచ్చితంగా పాదాలకు మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఇక ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని కనుక వారానికి ఒక్కసారి పాటిస్తే పాదాలపై మురికి మృత కణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.పాదాలు తెల్లగా మృదువుగా మారతాయి.అందంగా మెరుస్తాయి.