వీడియో: ట్రంప్‌పై కోపంతో బంగారం లాంటి టీవీని నాశనం చేసిన యువతులు..

యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ట్రంప్ విజయాన్ని అక్కడి మహిళలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Viral Video Girl Kicks Donald Trump Face During 2024 Us Election Victory Speech-TeluguStop.com

ఎందుకంటే ట్రంప్ మహిళల అబార్షన్ రైట్స్( Abortion Rights ) కాలరాశారు.దీనివల్ల వారందరూ కూడా ఆయనపై బాగా వ్యతిరేకత పెంచుకున్నారు.

మళ్లీ ఈసారి ఆయన అధికారంలోకి రావడం వల్ల అమెరికన్ మహిళలందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అక్కడి ఆడవారు అతన్ని ఎంతగా హేట్ చేస్తున్నారో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి 20 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

ఈ వైరల్ వీడియోలో ఒక టీవీ, అందులో డొనాల్డ్ ట్రంప్ విక్టరీ స్పీచ్( Donald Trump Victory Speech ) ప్రసారం కావడం చూడవచ్చు.అయితే టీవీలో కనిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ముఖాన్ని ఒక యువతి తన్నడం, గుద్దడం కూడా మనం చూడవచ్చు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై విజయ ప్రసంగం చేస్తున్న సమయంలో ఇది జరిగింది.ఒక యువతి టీవీ తెరపై ట్రంప్ ముఖాన్ని గుద్దడంతో వీడియో ప్రారంభమవుతుంది.ఆమె అవతలి అమ్మాయిని కూడా చేయమని ప్రోత్సహిస్తూ, “చెయ్యి.కొట్టు వాడిన్ని’ అని అంటుంది.

అప్పుడు రెండో అమ్మాయి “నిజంగానా?” అని ప్రశ్నిస్తుంది.

మొదటి అమ్మాయి పంచ్‌లు టీవీని( Television ) పాడుచేయవు.అని చెబుతుంది కానీ రెండో అమ్మాయి స్క్రీన్‌ని బలంగా తన్నడంతో ఎల్‌ఈడీ టీవీ పగిలిపోయింది.అమ్మాయిలిద్దరూ షాక్ అయ్యారు, ఎంతో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ టీవీ బద్దలు కావడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

బాధలో ఉన్న కమలా హారిస్ మద్దతుదారులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నవంబర్ 5న ట్రంప్ వైట్‌హౌస్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి డెమొక్రాట్‌లు అనుభవించిన నిరాశను ఆస్వాదించడానికి ట్రంప్ అనుకూల ఖాతాలు ఈ క్లిప్‌లను పంచుకుంటున్నాయి.

ట్విట్టర్‌ యూజర్లు యువతులు టీవీ పగలగొట్టిన వీడియోపై వివిధ రకాలుగా స్పందించారు.మరుసటి రోజు ఉదయం, ట్రంప్‌కు ఓటు వేసిన తల్లిదండ్రులు కొత్త టీవీని అడగవచ్చని ఒక యూజర్ చమత్కరించారు.

మరొక యూజర్ టీవీ వెంటనే పగిలిపోయిందని, అది ఏ బ్రాండో చెప్పాలని అడిగారు.ప్రజలు కొన్నిసార్లు ఓపికగా ఉండటం మంచిది అని ఇంకొకరు చెప్పారు, “టీవీ దెబ్బతినడం వల్ల ట్రంప్ విజయ ప్రసంగాన్ని ఆపివేసింది కదా” అని కొందరు రిటైర్లు పేల్చారు.

చాలామంది టీవీ ని అనవసరంగా పాడు చేశారని ఆ యువతులను తిట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube