ఈరోజుల్లో మోసగాళ్లు చాలా తెలివితో ఇతరులను బురిడీ కొట్టిస్తున్నారు.మనుషుల బలహీనతలతో మాత్రమే కాదు ఎమోషన్స్‌తో కూడా ఆడేసుకుంటున్నారు.
తాజాగా చైనా దేశం, టియాంజిన్‌కు (Tianjin, China)చెందిన వాంగ్ అనే వ్యక్తి కూడా మోసగత్తే వలలో పడ్డాడు.అతను ఆన్‌లైన్‌లో కలిసిన లి అనే మహిళ చేతిలో మోసపోయి భారీగా నష్టపోయాడు.
లి తనను తాను చాలా ధనవంతురాలిగా, అనేక ఆస్తుల యజమానిగా పరిచయం చేసుకుంది.అంతేకాదు, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నట్లు వాంగ్‌ను బాగా నమ్మించింది.
అయితే, వారి వివాహానికి ముందు ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించాలని లి వాంగ్‌కు చెప్పింది.ఆ ట్రెడిషన్‌ను “మ్యారేజి బెడ్ బర్నింగ్”(Marriage Bed Burning) అని పిలుస్తారట.
తన మరణించిన భర్త ఆమెకు అన్ని ఆస్తులను వదిలిపెట్టి వెళ్ళాడని, ఆయన ఆత్మను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆచారం అవసరమని లి వాంగ్‌కు(Li, Wang) నమ్మించింది.దాన్ని చేయకపోతే వారి వివాహం సుఖంగా సాగదు అని చెప్పింది.ఈ ప్రత్యేకమైన ఆచారానికి 100,000 యువాన్లు (సుమారు రూ.11,81,858) ఖర్చు అవుతుందని, దాన్ని నిర్వహించకపోతే అశుభం కలుగుతుందని వాంగ్‌కు చెప్పింది.వాంగ్, లి (Li ,Wang)ప్రేమలో పడిపోయి, ఆమె చెప్పిన మాటలు నమ్మి, ఆమెకు డబ్బు పంపాడు.కానీ డబ్బు తీసుకున్న తర్వాత లి (li)అదృశ్యమైంది.

హాంగ్‌క్సింగ్ న్యూస్ అనే మీడియా సంస్థ ఈ సంఘటనను ప్రచురించింది.ఈ సంఘటన, ఆన్‌లైన్ మోసాలు ఎంతటి స్థాయికి చేరుకున్నాయో తెలియజేస్తుంది.మోసగాళ్లు, ప్రేమ కోరుకునే వారి ఫీలింగ్స్ ఉపయోగించి, వారిని మోసగిస్తున్నారు.ఈ కేసులో, ఒక పురాతన నమ్మకాన్ని ఉపయోగించి వాంగ్‌ను మోసం చేశారు.