మునగాకు చేసే మ్యాజిక్.. ఇలా జుట్టుకు రాస్తే బోలెడు లాభాలు!

మునగాకు( Moringa Leaves ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 Amazing Benefits Of Moringa Leaves For Hair!, Moringa Leaves, Drumstick Leaves,-TeluguStop.com

మన భారతీయులు మునగాకు తో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తుంటారు.మునగాకులో పోషకాలు మెండుగా ఉంటాయి.

అందుకే వారానికి ఒక్కసారైనా మునగాకు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెఋతుంటారు.అయితే ఆరోగ్య పరంగానే కాదు జుట్టు సంరక్షణకు సైతం మునగాకు అపారమైన లాభాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా మునగాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా జుట్టుకు రాస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం కురుల విషయంలో మునగాకు చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Drumstick, Care, Care Tips, Fall, Pack, Healthy, Long, Moringa, Thick-Tel

ముందుగా ఒక అరటి పండు( Banana )ను తీసుకొని పీల్ తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, మూడు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకోవాలి.అలాగే అర కప్పు కొబ్బరి పాలు లేదా బాదం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ మునగాకు హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.

మునగాకు లో ఉండే ప్రోటీన్ అమైనో ఆసిడ్స్, విటమిన్స్, మినరల్స్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.జుట్టు రాలడాన్ని( Hairfall ) అరికడతాయి.

హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.అలాగే ఈ హెయిర్ ప్యాక్‌ లో అరటి పండును ఉపయోగించడం వల్ల అందులో ఉండే పలు సుగుణాలు కురులను స్మూత్ గా షైనీ గా మారుస్తాయి.

హెయిర్ డ్రై అవ్వకుండా రక్షిస్తాయి.

Telugu Drumstick, Care, Care Tips, Fall, Pack, Healthy, Long, Moringa, Thick-Tel

మరియు బాదం లేదా కొబ్బరి పాలు( Badam Milk ) ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కురులు చిట్లకుండా సైతం ఉంటాయి.ఇక ఆలివ్ ఆయిల్ తలలో తేమను పెంచుతుంది.

చుండ్రు సమస్యను తరిమి కొడుతుంది.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన పొడవాటి కురులను కోరుకునే వారు తప్పకుండా మునగాకుతో ఈ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube