జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.
జమ్ము కాశ్మీర్( Jammu and Kashmir ) లోని 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించారు. అక్టోబర్ ఐదున ఎన్నికలు జరిగాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు 93 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు .బాద్ షాపూర్, గురుగ్రం, పటోడి లో అదనంగా ఒక్కో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.మిగిలిన 87 స్థానాలకు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ను ఏర్పాటు చేశారు.ఈరోజు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.హర్యానా( Haryana)లో హోరా హోరీగా జరిగిన ఎన్నికల పోరులో కాంగ్రెస్ గెలుస్తుందా. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నేటి ఎన్నికల ఫలితాలతో అది తేలిపోనుంది.ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో , అక్కడి ఎన్నికల ఫలితాల పైన అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.జమ్మూ కాశ్మీర్ లో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి .జమ్మూ ప్రాంతంలో 43 స్థానాలు, కాశ్మీర్ పరిధిలో 47 స్థానాలు ఉన్నాయి.అసెంబ్లీకి ఐదు సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్ట్నెంట్ గవర్నర్ కు ఉంది .
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బిజెపి( BJP ) చాలానే ఆశలు పెట్టుకుంది. తప్పకుండా ఇక్కడ తామే అధికారంలోకి వస్తామని అంచనాలు బిజెపి ఉండగా కాంగ్రెస్ సైతం అంతే స్థాయిలో గెలుపు పై ధీమాతో ఉంది.ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఉదయం 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం రానుంది.అలాగే ఉదయం 11 గంటలకు ట్రెండ్స్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హర్యానాలో 90 నియోజకవర్గాలకు గాను 1031 మంది అభ్యర్థులు పోటీలు నిలిచారు .వీరిలో 464 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు.101 మంది మహిళలు పోటీలో ఉన్నారు.జమ్ము కాశ్మీర్ లోని 90 స్థానాలకు గాను మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 63.45 శాతం ఓటింగ్ జరిగింది.