నాని ఇంతమంది కొత్త దర్శకులని పరిచయం చేశాడా..?

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ మొదలు పెట్టిన నాని( Nani ) అనుకోకుండా వచ్చిన అవకాశంతో కెమెరా ముందుకొచ్చి హీరో అయ్యాడు.ఇక నాని ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి.

 Did He Introduce Me To So Many New Directors, Nani, Shyam Singarai , Ante Sundha-TeluguStop.com

ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా టాలెంట్, హార్డ్ వర్క్ తో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నారు.అలా అష్టా చెమ్మా ( Ashta chemma )మూవీతో నాని హీరో అయ్యాడు.2008లో విడుదలైన ఆ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది.స్నేహితుడు అనే మరో చిన్న సినిమాతో నాని అద్భుతం చేశాడు.

అలా మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల కంట్లో పడ్డాడు.నానికి ఫేమ్ తెచ్చిన మొదటి సినిమా అలా మొదలైంది.

 Did He Introduce Me To So Many New Directors, Nani, Shyam Singarai , Ante Sundha-TeluguStop.com

నాని నటుడిగా 15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు.తన సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ నాని ప్రధాన బలాలు.

అయితే శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి ( Shyam Singarai , Ante sundharaniki )లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం మంచి జోష్ మీద వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు నాని.తన కెరీర్ మొత్తం లో నాని స్టార్ డైరెక్టర్స్ తో కంటే కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసారు.

స్టార్డం వచ్చాక కూడా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు నాని.ఇప్పుడు నాని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం.

శ్రీకాంత్ ఓదెలనాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’.ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela )దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

నాగ్ అశ్విన్నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం తో నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

అంజనా అలీనిత్య మీనన్, నాని ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ చిత్రం వెప్పం.దీన్ని తెలుగులో ‘సెగ’ అనే పేరుతో రిలీజ్ చేసారు.ఈ చిత్ర దర్శకురాలు అంజనా అలీ ఖాన్( Anjana Ali Khan ) కి ఇది మొదటి చిత్రం.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

నందిని రెడ్డినాని కి కమర్షియల్ హీరో గా పేరు తెచ్చిన చిత్రం అలా మొదలైంది.నందిని రెడ్డి ( Nandini Reddy )ఈ చిత్రం తో దర్శకురాలిగా పరిచయం అయింది.ఇక ఈ సినిమా తర్వాత ఆమె ఇంకా చాలా సినిమాలకి డైరెక్షన్ చేసింది.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

తాతినేని సత్యభీమిలి కబడ్డీ జట్టు చిత్రం తో తాతినేని సత్య ( tatineni satya )దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

శివ నిర్వాణనాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నిన్ను కోరి.ఈ చిత్రం తో శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

శౌర్యవ్నాని తన తర్వాతి చిత్రం ప్రకటించారు.ఆ చిత్రాన్ని తో కూడా కొత్త డైరెక్టర్ ని లాంచ్ చేస్తున్నాడు నాని.

గోకుల్ కృష్ణనాని, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఆహా కళ్యాణం.ఈ చిత్రం తో గోకుల్ కృష్ణ( Gokul Krishna ) దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

ప్రశాంత్ వర్మఅ! చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రశాంత్ వర్మ( Prashant Verma ).ఈ చిత్రానికి నాని నిర్మాత.

Telugu Anjana Ali Khan, Gokul Krishna, Nag Ashwin, Nandini Reddy, Nani, Prashant

శైలేష్ కొలనువిశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ చిత్రం తో శైలేష్ కొలను( Shailesh kolanu ) డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందారు శైలేష్ కొలను.ఇక దాని తర్వాత వచ్చిన హిట్ 2 చిత్రం కూడా శైలేష్ డైరెక్షన్ చేసిందే…ఇక ఈ ప్రంచైజ్ చిత్రాలకు నాని నే నిర్మాత గా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube