యంగ్ టైగర్ ఎన్టీఆర్,( NTR ) కొరటాల శివ కాంబో మూవీ దేవర( Devara ) బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది.
మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.కొన్ని ఏరియాలలో ఇప్పటికే దేవరకు మంచి లాభాలు వచ్చాయి.
దాదాపుగా అన్ని ఏరియాలలో దేవర మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టేనని చెప్పవచ్చు.అయితే దేవర సినిమా నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకే( Naga Vamshi ) ఎక్కువ లాభాలను అందించిందని తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ కాగా అవుట్ రేట్ కు నాగవంశీ హక్కులను కొనుగోలు చేసి ఏరియాల వారీగా విక్రయించిన నేపథ్యంలో ఓవర్ ఫ్లోస్ అన్నీ నాగవంశీకి వస్తాయని చెప్పవచ్చు.

సితార నిర్మాత నాగవంశీ గతేడాది లియో సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ ఏడాది దేవర సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా విజయాన్ని అందుకున్నారు.ఏపీలో దేవర టికెట్ రేట్లు( Devara Ticket Rates ) భారీగా పెరగడం ఈ సినిమాకు వరమైంది.నాగవంశీ, త్రివిక్రమ్ లకు పవన్ సన్నిహితుడు కావడంతో దేవర టికెట్ రేట్లు భారీగా ఉండటంతో పాటు ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సాధ్యమైంది.

దేవర సినిమాకు సంబంధించి శాటిలైట్ డీల్ పూర్తి కావాల్సి ఉండగా ఏ ఛానల్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేస్తుందో చూడాల్సి ఉంది.శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తం వస్తే నిర్మాతలు భారీ లాభాలను కళ్లజూస్తారని చెప్పవచ్చు.బడ్జెట్ పరంగా దేవర విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు.దేవర1 నాగవంశీకి ఎంతో ప్లస్ అయిందని చెప్పవచ్చు.