యాదాద్రి భువనగిరి జిల్లా: గంధమల్ల ద్వారా నీళ్లను ఆలేరు వాగులోకి ఎలా వదిలారో అదేవిధంగా బస్వాపూర్ ద్వారా రాయగిరి చెరువు (Rayagiri pond)నింపి, బిక్కేరు వాగులోకి( Bikkera river) నీళ్లను వదలాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ డిమాండ్ చేశారు.సోమవారం యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri ) జిల్లా ఆత్మకూర్ (Atmakur)(ఎం) మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాళేశ్వరం కూలిపోయిందని ప్రజలను మోసం చేసి,నేడు గంధమల్ల రిజర్వాయర్ ద్వారా మా నాయకుడు నీళ్లు తెచ్చారని గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మకు,గంధమల్లకు నీళ్లు ఎలా వస్తున్నాయో రైతులకు చెప్పాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అటుకెక్కించిందని,అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన కొనసాగిస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ దుష్ట పాలనను అంతం చేస్తూ మళ్ళీ కెసిఆర్ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి,నాయకులు కోరే భిక్షపతి,పంజాల వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు,కోరె వెంకన్న, నాతి స్వామిగౌడ్, పర్వతాలు,ప్రభాకర్, రామిరెడ్డి,రాంబాబు, యాదగిరి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.