పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది.ఈ సినిమాలో సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా మగధీర మూవీని మించి వసూళ్లను సాధించింది.ఈ సినిమా సాధించిన వసూళ్ల రికార్డు రెండేళ్ల పాటు మరే సినిమా సాధించలేదు.తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను 219లో తమిళంలోకి రీమేక్ చేశారు.శింబు హీరోగా చేసిన ఈ రీమేక్ సినిమాకు వందా రాజా వదాన్ వరువేన్ పేరు పెట్టారు.
భారీ లెవల్ లో రీమేక్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
వందా రాజా వదాన్ వరువేన్ సినిమాను టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా కోటి రూపాయలు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకుంది.అంతేకాదు సుమారు 34 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.30 కోట్లకు థయేట్రికల్ బిజినెస్ చేశారు.కానీ ఈ సినిమా కేవలం 9 కోట్ల షేర్ ని మాత్రమే సాధించింది. రూ.21 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.ఈ విషయాన్ని లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది.
తెలుగులో సూపర్ హిట్ సాధించిన మూవీ రీమేక్ లో ఇంతటి పరాభవం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.
అటు తెలుగులో ఈ సినిమా విజయానికి చాలా కారణాలున్నాయి అంటారు సినిమా పండితులు.నిజానికి సినిమా కథ కాస్త వీక్ గా ఉంది.అయినా పవన్ కల్యాణ్ తన నటనతో ఆ లోపం కనిపించకుండా చేశాడు.
డీఎస్పీ మ్యూజిక్ అద్భుంతంగా పనిచేసింది.త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.
కానీ తమిళంలో శింబూ చేసిన సినిమా విజయం సాధించడంలో విఫలం అయ్యింది.తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చవి చూశాడు శింబు.
కొంత కాలం పాటు రీమేక్ సినిమాలు చేయాలంటేనే తమిళ దర్శకులు భయపడేలా చేసింది ఈ సినిమా అంటే పరిస్థితి ఏ రేంజిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.