మాజీ ప్రపంచసుందరిగా, నటిగా ప్రియాంక చోప్రా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
లైఫ్ గురించి మాట్లాడుతూ ప్రియాంక తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లైఫ్ లో తప్పులు చేయడం సహజంగా జరుగుతుందని కిందపడితే ఆత్మవిశ్వాసంతో పైకి లేవాలని ఆమె అన్నారు.
తాను ఇంజినీర్ కావాలని భావించానని కానీ కుటుంబ సభ్యులు తన ఫోటోలను మిస్ ఇండియా పోటీలకు పంపడంతో తర్వాత తాను హీరోయిన్ అయ్యానని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.మనం ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తామని అవతలి వాళ్ల గురించి ఆలోచించడం మానుకుంటే మంచిదని ప్రియాంక పేర్కొన్నారు.
నిజాయితీగా ఉంటూ నిన్ను నువ్వు అంగీకరించుకొని ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే మంచిదని ప్రియాంక తెలిపారు.

మనకు వచ్చిన అవకాశాలను నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకోవడం మన చేతిలోనే ఉందని ఆమె చెప్పుకొచ్చారు.మన లైఫ్ లో ఉండే మలుపులు ఎవరిని ఎలా తీసుకెళతాయో చెప్పలేమని మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె అన్నారు.తన బలం, బలహీనత ఫ్యామిలీ అని ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఉంటే దేనినైనా సాధించడం కష్టం కాదని ప్రియాంక చోప్రా తెలిపారు.

ఎవరైనా నువ్వు ఎంత సాధిస్తావో చెప్పలేరని ఏం సాధించగలమో గుర్తించి జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.తన ఆభరణం ఆత్మవిశ్వాసం అని అందరినీ ఆత్మవిశ్వాసంతో ఉండమని సూచిస్తానని ప్రియాంక చోప్రా తెలిపారు.మహిళలకు ఆర్థిక స్వేచ్చ ఉండాలని ఆర్థిక స్వేచ్చ ఉంటే లైఫ్ ను ఇష్టం వచ్చిన విధంగా జీవించగలరని ఆమె అన్నారు.మహిళలకు పెళ్లి జరిగినా ఆర్థికంగా దృఢంగా ఉండాలని అలా ఉంటే మాత్రమే ఇతరుల సహాయం లేకుండా మన కాళ్లపై మనం నిలబడగలమని ప్రియాంక చోప్రా తెలిపారు.