రవితేజ ( Ravi Teja ) హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ చిత్రం వెంకీ ( Venky )ఈ సినిమాకి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది.ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ లో వచ్చే సన్నివేశాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.
అప్పట్లో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ కూడా లభించింది.రవితేజ, స్నేహల కెమిస్ట్రీ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏ.వి.ఎస్ , కృష్ణ భగవాన్ ల కామెడీ,కలగలిపి ఈ సినిమాను రిపీటెడ్ గా ప్రేక్షకులు చూసేలా చేశాయి.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వల్ చిత్రం వస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కూడా భావించారు.తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి శ్రీనువైట్ల ( Sreenu Vaitla ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం శ్రీనువైట్ల విశ్వం( Vishwam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.గోపీచంద్ ( Gopi Chand ) హీరోగా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ శ్రీను వైట్ల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు వెంకీ సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
వెంకీ సీక్వెల్ సినిమాను ఎవరితో తీస్తారనే ప్రశ్నకు దర్శకుడు శ్రీను వైట్ల ఆసక్తికర సమాధానమిచ్చారు.ప్రస్తుత తరం హీరోల్లో అందరు మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లేనని చెప్పారు.ఎవరితోనైనా ఈ సినిమా వర్కౌట్ అవుతుందని శ్రీనువైట్ల చెప్పారు.
అయితే ఈయన సినిమా చేస్తారా లేదా అనే విషయం గురించి క్లారిటీ ఇవ్వలేకపోయినా అభిమానుల మాత్రం ఎంతో అద్భుతమైన సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించి చెడగొట్టకండి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.వెంకీ మంచి కల్ట్ మూవీ దానికి పార్ట్ 2 తీసి.
చెడగొట్టాలా అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.