టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన అన్నట్లు కొంతమంది ఉన్నారు.వీళ్లు తమ క్యారెక్టర్‌కి జీవం పోస్తారు.
వారిలో తనికెళ్ళ భరణి( Tanikella Bharani ) ఒకరు.వాస్తవానికి భరణి ఒక సినీ రచయిత.
ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగులు రాశాడు.నాటక రంగంలో కూడా రాణించాడు.
ఇక సినిమాల్లో మొదటగా చాలా నెగెటివ్ క్యారెక్టర్స్ చేశాడు.ఆయన వేసిన వేషాలు చాలా దారుణంగా, క్రూరంగా ఉండేవి.
అయితే ఆ క్యారెక్టర్లలో జీవించేవాడు కాబట్టి ప్రేక్షకులు తాము ఒక సినిమా మాత్రమే చూస్తున్నామని, తమకు కనిపించేది ఒక కల్పిత పాత్ర మాత్రమే అని మరిచి భరణిని బాగా ద్వేషించేవారు.అలాంటి కొన్ని ఘటనల గురించి ఈ నటుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తనికెళ్ళ భరణి మాతృదేవోభవ సినిమాలో( Matru Devo Bhava Movie ) మహా చెడ్డ క్యారెక్టర్ అయిన అప్పారావు పాత్ర అద్భుతంగా పోషించాడు.ఇందులో సత్యం అనే క్యారెక్టర్ పద్యానికి బానిస అవుతాడు ఇక ఎక్కువ కాలం బతకను అని తెలుసుకొని కుమిలిపోతాడు.భార్య కోసమే తన అలవాట్లను చేంజ్ చేసుకుంటాడు.అయితే ఫస్ట్ నుంచి అప్పారావుకు, సత్యంకు పడదు.సత్యాన్ని ఎలాగైనా చంపేయాలని పగతో రగిలిపోతుంటాడు అప్పారావు.చివరికి అలాంటి ఛాన్స్ రానే వస్తుంది.
అంతే ఇంకేముంది అప్పారావు( Apparao ) దారి కాచి అతన్ని కత్తితో పొడిచేస్తుంటాడు.అలాంటి ఏం సమయంలో ‘నేను చచ్చిపోతే నా భార్య, పిల్లలు దిక్కులేని వారైపోతార్రా.
నన్ను చంపొద్దు అప్పారావ్’ అంటూ బతిలాడతాడు సత్యం.కానీ, అప్పారావు అత్యంత క్రూరంగా అతన్ని చంపేస్తాడు.

మాతృదేవోభవ సినిమాలో ఈ సన్నివేశం బాగా హైలెట్ అయింది.ఈ సీన్ చూసిన ప్రతి ప్రేక్షకుడు అప్పారావు క్యారెక్టర్‌ను కచ్చితంగా తిట్టే ఉంటాడు.ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో భరణి చాలా నేచురల్ గా చెడ్డవాడి లాగా నటించి ప్రేక్షకులను అది నిజమే అని నమ్మేలా చేశాడు.తనికెళ్ళ భరణి “ఆమె” సినిమాలో కూడా ఇలాంటి దుష్ట క్యారెక్టర్ ఒకటి పోషించాడు.
అప్పుడు కూడా భరణిని బాగా తిట్టుకున్నారు ప్రేక్షకులు.
ఈ రెండు క్యారెక్టర్స్ చేయడం వల్ల ఆయనపై ప్రేక్షకుల్లో ఒక దురభిప్రాయం కూడా ఏర్పడింది.
నీకే బయట కనిపించినప్పుడు కూడా డైరెక్ట్ గా ఆయన్ను తిట్టే వారట.ఒకసారి మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే తెలంగాణ ఆవిడ ‘ఏందయ్యా.
పాపం అతన్ని అంత అన్యాయంగా చంపినవ్’ అని తిట్టిపోసిందట.అది కేవలం సినిమానే అమ్మా అని చెప్పినా సరే “ఎంత సినిమా అయితే మాత్రం అంత దారుణంగా చంపుతావా?” అని అడిగిందట.దాంతో భరణి ఏం మాట్లాడాలో తెలియక అక్కడినుంచి వచ్చేసాడట.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన చాలా ఏళ్లకు అమెరికాలో( America ) ఉంటున్న ఒక అమ్మాయి ‘నిన్ను చంపెయ్యాలని ఉంది’ అంటూ ఓ మెసేజ్ ద్వారా పెద్ద వార్నింగ్ ఇచ్చిందట.అది చూసి తనికెళ్ల భరణి వణికిపోయాడట.“ఈ తరంలో కూడా ఆ సినిమాకి, అందులోని నా క్యారెక్టర్‌కి అంతగా ప్రేక్షకులు కనెక్ట్ అవడం నిజంగా ఆశ్చర్యకరం.అది నా అదృష్టం.నా క్యారెక్టర్లు వారిని ఆ స్థాయిలో కదిలించాయంటే నటుడిగా నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అంటూ తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు.