అక్కినేని నాగార్జునకు( Akkineni Nagarjuna ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.అయితే కొండా సురేఖ( Konda Surekha ) చేసిన కొన్ని కామెంట్ల వల్ల నాగార్జున కుటుంబం బాధ పడిన సంగతి తెలిసిందే.
నాగార్జున కొండా సురేఖ కామెంట్ల విషయంలో క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు.ఈ పరువు నష్టం దావా విషయంలో నాంపల్లి కోర్టు విచారణ చేపట్టడం గమనార్హం.
నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది.
ఈ కేసు విషయంలో నాగార్జున తరపు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది.
నాగార్జున వాంగ్మూలంతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని సైతం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.నాగార్జున దావా వేసిన సమయంలోనే మా ఫ్యామిలీపై మంత్రి సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
కొండా సురేఖ చేసిన కామెంట్ల వల్ల మా ఫ్యామిలీ గురించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని నాగ్ అన్నారు. కొండా సురేఖ నాగార్జున దావా గురించి స్పందించడానికి ఇష్టపడలేదు.ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
నాగ్ ఈ పిటిషన్ విషయంలో రాజీ పడే అవకాశమే లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
నాగార్జున ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.తమిళ హీరోల సినిమాలలో నాగ్ ఎక్కువగా నటిస్తున్నారు.కుబేర,( Kubera ) కూలీ( Coolie ) సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాల్సి ఉంది.
నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.నాగార్జున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.