ప్రస్తుతరోజుల్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.కార్పొరేట్ ఆఫీస్ లలో గంటల కొద్ది పనులు చేస్తూ.
చాలీచాలని జీవితాలతో గడిపేస్తున్న చాలామంది సొంతంగా చిరు వ్యాపారాలు చేయడం మొదలుపెట్టేశారు.ముఖ్యంగా చిరు తిండి సంబంధించిన దుకాణాలు, అలాగే టీ షాపులు( Tea Shop ) పెట్టడంతో ఎంతోమంది విజయవంతంగా వారి బిజినెస్ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఇకపోతే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మెచ్చిన నాగపూర్ డాలీ చాయ్ వాళ్ల గురించి బ్రతకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాపులారిటీకి చదువు అవసరం లేదని నిరూపించిన ఏకైక వ్యక్తిగా భారతదేశంలో అతడిని ఒక్కడిని చూస్తే సరిపోతుంది.
ఇకపోతే సిమ్రాన్ గుప్తా అనే యువతి ‘ మోడల్ చాయ్ ‘( Model Chai ) పేరుతో లక్నోలో టీ స్టాల్ ను ఓపెన్ చేసింది.
ప్రస్తుతం ఆమె టీ స్టాల్ నిర్వహిస్తున్న సమయంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ బ్లాగర్ ఛానల్ మహిళ నడుపుతున్న టీ షాప్ వీడియోను పోస్ట్ చేయగా అతి తక్కువ సమయంలోనే పది మిలియన్స్ కు పైగా వ్యూస్ సంపాదించి ప్రస్తుతం ట్రేండింగ్ లో కొనసాగుతోంది.ఇకపోతే 2018 లో మిస్ గోరఖ్పూర్ టైటిల్ ని గెలుచుకున్న సిమ్రాన్ గుప్తా( Simran Gupta ) ఆ తర్వాత మోడలింగ్ లో అడుగు పెట్టింది.
మోడలింగ్ చేస్తున్న సమయంలో చాలా యాడ్స్ లో పనిచేసింది.కాకపోతే, కరోనా సమయంలో నటనకి గుడ్ బై చెప్పినట్టు ఆవిడ ఇదివరకే ఓ చానల్లో ఇంటర్వ్యూలో తెలిపింది.ఇక ఆ తర్వాత ఆమె కుటుంబం తన సంపాదన పైనే ఆధారపడి ఉండడంతో ఆ సమయంలో తనకి ఈ షాప్ పెట్టాలన్న ఆలోచన వచ్చిందని.అందుకు ఎంబీఏ చాయ్ వాలా అనే టీ షాప్ ప్రేరణగా నిలిచిందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆవిడ చేసిన టి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే.
మరికొందరైతే ఆమె చాయ్ చేయడం కంటే ఓవర్ యాక్టింగ్ చేయడం ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో అని ఒకసారి విక్షించండి.