బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఈ షోకు మంచి గుర్తింపు ఉంది.
అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్8( Bigg Boss 8 ) తెలుగులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.అయితే తమిళంలో నిన్న బిగ్ బాస్ షో సీజన్8 మొదలైంది.
తమిళ బిగ్ బాస్ షోకు( Tamil Bigg Boss Show ) విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.గత సీజన్ వరకు బిగ్ బాస్ తమిళ్ కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు.

కమల్ హాసన్ కొన్ని కారణాల వల్ల ఈ షోకు హోస్ట్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే.అయితే షో మొదలైన 24 గంటల్లోనే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారంటూ విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) బాంబు పేల్చారు.మరీ ఒక్కరోజులో హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహారాజ మూవీలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన సచిత అనే అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్టు సమాచారం అందురోంది.ఈ నిర్ణయం బిగ్ బాస్ తలతిక్క నిర్ణయం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈరోజు ఎపిసోడ్ చూస్తే సచిత నిజంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారో లేదో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.బిగ్ బాస్ సీజన్8 తమిళ్ లోకి మహాలక్ష్మి భర్త రవీందర్ కూడా వెళ్లారు.
తమిళ బిగ్ బాస్ షోలో బుల్లితెర నటులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.బిగ్ బాస్ షో సీజన్8 తమిళ్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్8 తమిళ హోస్ట్ గా విజయ్ సేతుపతి ఏ స్థాయిలో మెప్పిస్తారో అని కామెంట్లు వినిపిస్తున్నాయి.