పాఠశాలల్లో బోధన, క్రమశిక్షణ విషయానికి వస్తే.ఉపాధ్యాయులు తరచుగా విద్యార్థులతో కొంత కఠినంగా ఉండడం మాములే.
టీచర్లు( Teachers ) తరచూ పిల్లలను తప్పుడు పనులు చేస్తున్నపుడు కొన్నిసార్లు వారిని కొట్టడానికి ప్రయత్నిస్తారు.అయితే, చైనాలోని ( China )ఓ పాఠశాలలో ఓ సమ్మర్ క్యాంప్ టీచర్ ఓ చిన్నారికి చాలా భారీ శిక్ష విధించింది.
దీంతో విద్యార్థి దాదాపు మృత్యువు అంచుకు చేరుకుంది.దాంతో ఇప్పుడు ఆ బాలుడు జీవితంలో తన కాళ్ళపై నిలబడలేని పరిస్థితి ఏర్పడింది.
చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్( Shan Dong Province ) లోని ఓ మిడిల్ స్కూల్‌లో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.వేసవి శిబిరంలో 1,000 సిట్ అప్‌లు చేయాలనీ 13 ఏళ్ల విద్యార్థిని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు శిక్షించాడు.అందిన సమాచారం ప్రకారం, బాలుడు 200 సిట్ అప్‌లు చేసిన తర్వాత నొప్పిని అనుభవించడం ప్రారంభించాడు.అయినా టీచర్ పట్టు వదలలేదు.విద్యార్థికి విధించిన శిక్షను ఆపకుండా.గుంజీలు తీయమంటూ ఆ స్టూడెంట్ నివేధించడం కొనసాగించాడు.
ఉపాధ్యాయుడి శిక్ష కారణంగా ఆ విద్యార్థికి కాళ్లలో భరించలేని నొప్పి వచ్చింది.మొదట్లో బాలుడికి కండరాల నొప్పులకు మందులు ఇచ్చారు.ఎన్ని మందులు వాడినా బాలుడి బాధ తగ్గలేదు.ఆ చిన్నారికి అధిక శారీరక శ్రమ వల్ల వచ్చే తీవ్రమైన అనారోగ్యం రాబ్డోమియోలిసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తర్వాత గుర్తించారు.
ఇది తీవ్రమైన కండరాల నష్టాన్ని కలిగిస్తుంది.ఇది కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న సోషల్ మీడియా వినియోగదారులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.ఇలాంటి ఉపాధ్యులను వేంటనే విధుల నుండి తొలిగించాలని ., మరోసారి ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.