ఇటీవల కాలంలో ఎందరినో పట్టిపీడిస్తున్న సమస్య రక్త హీనత.శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడాన్నే రక్త హీనత అని అంటారు.
రక్త హీనత ఏర్పడినప్పుడు నీరసం, అలసట, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవడం, ఒత్తిడి పెరిగిపోవడం, శరీరం చల్లబడిపోవడం, తలనొప్పి ఇలా ఎన్నో లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తూకాలాన్ని గడిపిస్తే ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.
అలా జరగకుండా ఉండాలీ అంటే ఖచ్చితంగా రక్తహీనతను నివారించుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు రక్త హీనతకు చెక్ పెట్టడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
అలాంటి వాటిలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి.గులాబీ రంగులో ఉండే ఈ ఫ్రూట్ ప్రస్తుతం అన్ని మార్కెట్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
మంచి రుచి కలిగి ఉండే ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, ఫోలిక్ యాసిడి, కార్బొహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, బెటాలైన్స్, కెరొటెనాయిడ్స్ ఇలా ఎన్నో పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది.
అందుకే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటుంది.ముఖ్యంగా రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడే వారు ప్రతి రోజు తగిన మోతాదులో డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోవాలి.ఇలా చేస్తేఅందులో ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేస్తుంది.
దాంతో రక్త హీనత పరార్ అవుతుంది.అలాగే డ్రాగన్ ఫ్రూట్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకుంటే గుండె పోటు మరియు గుండె సంబందిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మధుమేహం దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.కాబట్టి, రక్త హీనత ఉన్న వారే కాదు అందరూ డ్రాగన్ ఫ్రూట్‌ను ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు.