యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఇటీవల “దేవర”( Devara ) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలోని పాటలకు తారక్ వేసిన డ్యాన్స్( NTR Dance ) అదిరిపోయింది అనే చెప్పాలి.
నిజానికి ఈ హీరో డ్యాన్స్ గురించి అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు.జూ.
ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం చేస్తూ వస్తున్నాడు.స్కూల్ డేస్ నుంచి డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టి, కొంతకాలంలోనే చాలా గొప్ప డ్యాన్సర్‌గా మారాడు.17 ఏళ్ల వయసు వరకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చాడు.
ఇక సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత మాస్ స్టెప్పులతో దుమ్మురేపాడు.ఈ నటుడు జ్వరం వచ్చినా లేదంటే కాళ్లకు ఏదైనా గాయాలు అయినా సరే సినిమా షూటింగ్ కి వచ్చి ఎంత కష్టమైన స్టెప్ అయినా సింగల్ టేక్ లో చేసేస్తాడు.అంతటి గొప్ప డాన్సింగ్ స్కిల్స్ అతని సొంతం.
అయితే సినిమాల్లో ఫైటింగ్, యాక్టింగ్ కామెడీ చేయడం వంటి వాటన్నిటి కంటే అతనికి డాన్స్ అంటేనే చాలా భయమట.ఎంత కష్టమైనా సన్నివేశాల్లోనైనా నటించడం, ఎమోషనల్ సన్నివేశాల్లో యాక్ట్ చేయడం అతనికి చాలా ఈజీగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుందట.
ఇక ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే పేపర్ చూసి చదివేసి వెంటనే చెప్పగలనని అతను చెబుతుంటాడు.ఫైట్లు కూడా ఎలాగోలా కష్టపడి ఫినిష్ చేయగలనని కానీ డ్యాన్స్ మాత్రమే తనకు చాలా కష్టమైన పని అని తారక్ ఒకానొక సందర్భంలో తెలిపాడు.
నాలుగు సార్లు అటు ఇటు ఎగిరి మమ అనిపించొచ్చు.అదే డాన్స్ అని చెప్పవచ్చు.కానీ తనకు అలా నచ్చదని, గత సినిమాతో పోల్చుకుంటే ప్రస్తుత సినిమాలో తన డాన్స్ అద్భుతంగా ఉండాలని తాను కోరుకుంటానని తారక్ చెబుతుంటాడు.తనకు తానే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాడట.
నిజానికి ఫ్యాన్స్ కూడా ఇంకా మంచి డ్యాన్స్‌ను తారక్ నుంచి ఆశిస్తుంటారు.ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాగలనో లేదో అని తాను బాగా భయపడతానని ఎన్టీఆర్ తెలిపాడు.
తారక్ ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటలో( Naatu Naatu Song ) అద్భుతంగా డ్యాన్స్ చేశాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటే తారక్ డాన్స్ ఇందులో చాలా బాగుందని అనేక మంది కామెంట్లు కూడా చేశారు.
ఏదేమైనా తారక్ డ్యాన్స్ లో తోపు.అయినా ఆయన డ్యాన్స్ అంటే భయపడటమే ఆశ్చర్యకరం.
తారక్ మల్టీ టాలెంటెడ్ హీరో.ఈ యంగ్ టైగర్ కి చాలా విషయాల్లో మిగతా హీరోలు పోటీకి రాలేరు అని చెప్పవచ్చు
.