ఈరోజుల్లో చాలామంది తాము ఎంజాయ్ చేస్తున్న క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు.లైక్స్, కామెంట్లతో పాటు ఫాలోవర్లను పెంచుకుందామని ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో కొందరు ప్రమాదాల బారిన పడుతూ మృతి చెందుతున్నారు.ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు సోషల్ మీడియా మోజులో పడి చనిపోతుంటే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ప్రస్తుతం అలాంటి ఒక కడుపుకోతను రష్యన్ పేరెంట్స్ అనుభవించాల్సి వస్తోంది.
రష్యాకు చెందిన 27 ఏళ్ల టిక్‌టాక్(TikTok star) స్టార్ అరినా గ్లాజునోవా(Arina Glazunova) ఇటీవల జార్జియాలోని టిబిలిసి నగరానికి వెళ్ళింది.
అక్కడ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.అయితే అదే క్రమంలో అండర్‌పాస్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది.ఆమె తన స్నేహితులతో వీడియో తీస్తుండగా, మెట్ల మీద ఉన్న ఒక చిన్న గోడపై తడబడి పడిపోయింది.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ విషాద సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ నిర్మాణంలోని భద్రతా లోపాల గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.విచిత్రంగా, అరినా ఈ వీడియోలో రష్యన్(Russian) పాటైన “ఫర్ ది లాస్ట్ టైమ్” పాడుతుండటం గమనార్హం.అంటే ఇదే ఆఖరి సమయం అంటూ ఆమె పాట పాడింది.
ఆమె నోట్లో నుంచి వచ్చిన ఆ పదాలే నిజమయ్యాయి.అదే ఆమె చివరి పాట, చివరి క్షణం అయిపోయింది.
అరినా తీవ్రగాయాల పాలైనప్పుడు ఫ్రెండ్స్ వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యి, మెడ విరిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయిందని స్థానిక మీడియా నివేదించింది.ఆమె మరణించిన ప్రదేశంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయబడింది.వైరల్ వీడియోలో అరినా ముందుకు వంగి సిమెంట్ మెట్లపై పడిపోయినప్పుడు ఆమె స్నేహితురాలు వెంటనే రియాక్ట్ కావడం చూడవచ్చు.
అరినా కేకలు వినిపిస్తున్నాయి, ఆ తర్వాత స్క్రీన్ చీకటి అవుతుంది.తరువాత ఆమె స్నేహితురాలి భయాందోళన కలిగిన స్వరం వినిపిస్తుంది.
స్థానికులు ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమని చెప్పారు.అక్కడ ఉన్న గోడ చాలా చిన్నది కాబట్టి ఎవరైనా పడిపోవచ్చు అని వారు అన్నారు.కొంతమంది ప్రజలు రాత్రి సమయంలో ఆ గోడను చూడడం కష్టమని అన్నారు.ఇలా పడిపోవడం ఇదే మొదటిసారేనా అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.చాలా మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఒక వ్యక్తి “అక్కడ రైలు లేదా గోడ లేకపోవడం షాకింగ్ విషయం.కొన్ని ఇంచుల ఎత్తు ఉన్న గోడ వల్ల ఎవరైనా పడిపోవచ్చు” అని అన్నారు.
మరొకరు “అక్కడ ఓపెనింగ్ చుట్టూ గోడలు లేకపోవడం చాలా బాధాకరం.ప్రజలు ఎలా ఇంత పేలవంగా డిజైన్ చేస్తారు, ముఖ్యంగా రాత్రి సమయంలో?” అని మండిపడ్డారు.