ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే.ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా పలు సందర్భాలలో ఆమెపై అత్యాచారం కూడా చేశారు అంటూ సదురు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు.
ఇలా పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఈయనకు రిమాండ్ విధిస్తూ చంచల్ గూడ జైలుకు తరలించారు.ఇలా చంచల్ గూడ జైలులో ఉన్నటువంటి జానీ మాస్టర్ బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఈయనకు కోర్ట్ మధ్యంతర బెయిలు జారీ చేసింది.అక్టోబర్ ఆరవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈయనకు బెయిల్( Bail ) ఇస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈయనకు బెయిల్ వచ్చిందని ఆనందపడేలోపు జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీ షాక్ ఇచ్చింది.ఈయన పట్ల ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈయనకు కేటాయించిన జాతీయ అవార్డును(National Award) వెనక్కి తీసుకుంటున్నట్లు కమిటీ వెల్లడించింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.జానీ మాస్టర్ కు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకి ఎంపికయ్యారు.
ప్రస్తుతం ఈయనకు ఈ అవార్డును రద్దు చేశారు.ఇకపోతే ఈయనకు ఈ అవార్డు వెనక్కి వెళ్లిపోవడంతో మరో షాకింగ్ న్యూస్ తగిలింది.జానీ మాస్టర్ కు అవార్డు వెనక్కి వెళ్లిపోవడంతో పోలీసులు ఈయన బెయిల్ రద్దు చేయాలి అంటూ కోర్టును ఆశ్రయించారు.మరి జానీ మాస్టర్ బెయిల్ రద్దు అవుతుందా లేదా ఈయనకు బెయిల్ పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ కేసు పై ఈయన గతంలో పోలీసు విచారణలో కొందరు నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని తెలిపారు.