యూత్‌లో హింసా ప్రవృత్తిని బాగా పెంచేసిన రామ్ గోపాల్ వర్మ మూవీ..

రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )డైరెక్ట్ చేసిన యాక్షన్ క్రైమ్ సినిమా శివ ( Shiva )(1989) తెలుగు రాష్ట్రాలలోని యువతపై చాలా ప్రభావం చూపించింది.ఈ సినిమా విడుదలయ్యాక శివ గ్యాంగ్ పేరిట యువత గుంపులుగా ఏర్పడి గొడవలు కూడా పెట్టుకున్నారు.

 Rgv Shiva Is First Revolution In Industry , Ram Gopal Varma , Rgv Shiva , Shiv-TeluguStop.com

పోలీసులు వారికి బాగా కోటింగ్‌ ఇచ్చి కంట్రోల్ లోకి తెచ్చారు, అది వేరే విషయం.గ్యాంగ్ వార్స్‌ బాగా పెరిగిపోవడానికి శివ సినిమానే కారణం.

ముఖ్యంగా కరీంనగర్‌లో ఈ సినిమా వచ్చిన తర్వాతే యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోయింది.కాలేజీ పిల్లగాళ్ల మధ్య కూడా దాడులు పెరిగిపోయాయి.

యువత గ్యాంగులుగా మారి ఒకళ్లనొకళ్లు రెచ్చగొట్టుకొని, మరీ తన్నుకునేవారు.వేళ్లకు నిఖిల్ పంచు తొడుక్కుని, చేతి వేళ్లకు సైకిల్ చైన్ చుట్టుకొని ఒకరిని ఒకరు తన్నుకునే స్థాయికి వచ్చారంటే ఈ మూవీ వారిలో హింసాత్మక స్వభావాన్ని ఎంతగా పెంచిందో అర్థం చేసుకోవచ్చు.

శివ ఒక ట్రెండ్ సెట్టర్, అందులో డౌట్ లేదు.ఈ ఆల్‌టైమ్‌ హిట్ 90s కిడ్స్‌పై చెరగని ముద్ర వేసింది.35 ఏళ్లు గడిచినా, ఆ ఎఫెక్ట్ వారిలో అలాగే ఉండిపోయిందంటే అతిశయోక్తి కాదు.

తెలుగు సినిమా రంగాన్ని శివ సినిమా బాగా షేక్ చేసింది.

ఈ మూవీ పోస్టర్‌ కూడా ఒక సంచలనం.ఇందులో వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్‌తో శివ టైటిల్‌లోనే నాగార్జున( Nagarjuna ) ఫేస్‌ను చక్కగా డిజైన్ చేశారు.

సింగిల్ సైడ్ లైటింగు, రౌద్రంగా కళ్లెర్ర చేసి చూస్తున్న నాగార్జున స్టీల్ చాలామంది యువతలో క్యూరియాసిటీని కలిగించింది.ఈ పోస్టర్‌లో ఓ సైకిల్ చైన్ పట్టుకొని నాగార్జున చాలా మాస్‌గా కనిపించాడు.

ఆ పోస్టర్‌ను ఒకసారి చూస్తే ఎప్పటికీ గుర్తుండి పోయేలాగా డిజైన్ చేశారు.ఈ సినిమాను థియేటర్లో చూశాక ప్రతి ఒక్కరి మదిలో ఒక సెన్సేషనల్ ఫీలింగ్ కలిగింది.

Telugu Natural, Rowdyism-Movie

కమర్షియల్ సినిమాలకు శివ మూవీ కొత్త అర్థాన్ని ఇచ్చింది.ఇందులో బెజవాడ రౌడీలు గ్యాంగులుగా విడిపోయి నడి బజార్లలో కొట్టుకుంటారని ఈ సినిమాలో చూపించారు.రౌడీయిజం, కాలేజీ పాలిటిక్స్, నేచురల్ టేకింగ్, ఎమోషన్స్‌తో మిళితమైన ఈ మూవీ యువతకు బాగా నచ్చేసింది.ఇది వాళ్లలో హింసా ప్రవృత్తిని ప్రేరేపించింది.ఇవే ఎలిమెంట్స్‌తో రామ్‌ గోపాల్ వర్మ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ రాబట్టింది.

టాలీవుడ్ చరిత్రలో ఒక సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Telugu Natural, Rowdyism-Movie

నేటి సినిమాలో విలన్లు సిక్స్ ప్యాక్ బాడీలతో గట్టిగట్టిగా అరుస్తూ చిరాకు తెప్పిస్తున్నారు కానీ అలాంటివేమీ లేకుండా ఒక విలన్ క్రూరత్వాన్ని ఎలా ప్రదర్శించాలో అలా ప్రదర్శించి వావ్ అనిపించాడు రఘువరన్.కోటా శ్రీనివాస్ రావు, గొల్లపూడి మారుతీ రావులు నట విశ్వరూపం కనబరిచారు.జగన్, చిన్నా, ఉత్తేజ్ వంటి నటులు కూడా ప్రేక్షకులను రంజింపజేసి ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు.

అమల ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.యువసామ్రాట్ నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

బీభత్సమైన స్టార్డమ్‌ ఆయన సొంతమైంది! ఇళయరాజా మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్! బాటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది సోదరా ఏది బెస్టురా సాంగ్ బంపర్ హిట్టైంది.మొత్తం మీద ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలపై చాలా ప్రభావం చూపించిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube