జానీ మాస్టర్ అవార్డ్ రద్దుపై కర్ణాటక మంత్రి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( jany master ) బెయిల్ రద్దు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయింది.జానీ మాస్టర్ బెయిల్ రద్దు గురించి కాంగ్రెస్ మంత్రి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.

 Karnataka Minister Shocking Comments About Jani Master Award Details Inside Goes-TeluguStop.com

కర్ణాటక మంత్రి దినే గుండూరావు( Karnataka Minister Dine Gundurao ) మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను ప్రజలు సహించరని అన్నారు.

అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ సంస్థలు పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో మహిళల పాత్ర పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.మహిళలపై వేధింపులను అరికట్టి వాళ్లకు ఇబ్బందులు లేని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వ బాధ్యత అని.ఆయన తెలిపారు.అయితే ఈ విషయంలో బీజేపీ సర్కార్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Telugu Congress, Cm Yeddyurappa, Jani Master, Karnataka, Karnatakadine, Karnatak

మాజీ సీఎం యడ్యూరప్పపై ( former CM Yeddyurappa )కూడా పోక్సో కేసు నమోదైందని జులై నెలలో సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసిందని ఆయన పేర్కొన్నారు.సీఐడీ ఈ కేసులో 700 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేసిందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.ఛార్జిషీట్ లో సాక్ష్యాలను తారుమారు చేయడం, కేసును కప్పిపుచ్చడం ఇతర అభియోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కామెంట్లు చేశారు.

Telugu Congress, Cm Yeddyurappa, Jani Master, Karnataka, Karnatakadine, Karnatak

యడ్యూరప్పను పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడిగా ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.కేసు విచారణ జరిగే వరకు ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించలేరా అంటూ కాంగ్రెస్ మంత్రి ప్రశ్నించడం కొసమెరుపు.వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌కు ఇచ్చిన అవార్డును రద్దు చేసిన కేంద్రం యడ్యూరప్పపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు.మంత్రి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube