సాధారణంగా కొందరికి తరచూ వాంతులు అవుతూ ఉంటాయి.ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, మద్యపానం, జీర్ణాశయం వాపు, పోషకాల లోపం, అతిగా ఆహారం తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల తరచూ వాంతులు అవుతూ ఉంటాయి.ఈ సమస్య ఉన్న వారు బయటకు వెళ్లేందుకే భయపడుతుంటారు.
అలాగే వాంతుల సమస్యను నివారించేందుకు ఎన్నో మందులు వాడతారు.అయితే కొన్ని కొన్ని న్యాచురల్ టిప్స్ పాటిస్తూ కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా చూసేయండి.
వాంతుల సమస్యను నివారించడంలో అల్లం అద్భుతంగా సహాయపడుతుంది.
వాంతులతో బాధ పడే వారు.ప్రతి రోజు ఉదయాన్నే అల్లంతో తయారు చేసిన టీని ఒక కప్పున తీసుకోవాలి.
ఇలా చేస్తే అల్లంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు.వాంతులు మరియు వికారం సమస్యలను దూరం చేస్తాయి.

అలాగే తులసి ఆకులు కూడా వాంతుల సమస్యకు చెక్ పెడతాయి.కొన్ని ప్రెష్ తులసి ఆకులను తీసుకుని.నమిలి మింగేయాలి.లేదా వాటర్‌లో తులసి ఆకులను బాగా మరిగించి.వడబోసి తేనె కలుపుకుని సేవించాలి.ఇలా ఎలా చేసినా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
వాంతుల సమస్య దూరం అవుతుంది.

నిమ్మ రసంతోనూ వాంతులను నివారించుకోవచ్చు.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నిమ్మ రసం కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే వాంతులు, వికారం, కళ్లు తిరగడం వంటి సమస్యలు పరార్ అవుతాయి.
ఇక ఈ టిప్స్‌తో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి.ఆయిల్ ఎక్కువగా, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
కాఫీ, టీ, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోరాదు.అలాగే టైమ్‌కు తినడంతో పాటు తిన్న వెంటనే పడుకోకుండా కనీసం పది నిమిషాలపాటు నడవాలి.
ఇవి పాటిస్తే వంతుల సమస్యే ఉండదు.